RCB victory parade | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 18 సంవత్సరాల సుదీర్ఘ లీగ్‌లో ఆర్సీబీ తొలిసారి టైటిల్‌ను గెలువడంతో ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. ఇక ఇవాళ మధ్యాహ్నం భారీ పరేడ్‌కు ఆర్సీబీ యాజమాన్యం ప్లాన్ చేసింది. అయితే, గెలుపుతో ఫుల్ జోష్‌మీదున్న జట్టుకు బెంగళూరు నగర పోలీసులు (Bengaluru Police) షాకిచ్చారు. గ్రాండ్ విక్టరీ పరేడ్‌కు అనుమతిని నిరాకరించారు. దీంతో మధ్యాహ్నం జరగాల్సిన విక్టరీ పరేడ్ రద్దైంది (victory parade cancelled). సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకూ చిన్నస్వామి స్టేడియంలో సత్కార కార్యక్రమానికి మాత్రం అనుమతించారు. పోలీసుల నిర్ణయంతో ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆర్సీబీ జట్టు బెంగళూరుకు చేరుకుంటుంది. ఆ తర్వాత ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్‌కు ఆర్సీబీ యాజమాన్యం ప్లాన్ చేసింది. మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధలో పరేడ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంకు చేరుకోవాల్సి ఉంది. అక్కడ సుమారు 50 వేల మంది ప్రేక్షకుల మధ్య విక్టరీ పరేడ్ సంబరాలు జరిగేలా జట్టు యాజమాన్యం ప్లాన్ చేసింది. అయితే, పోలీసులు ఈ పరేడ్‌కు అనుమతి నిరాకరించారు. విక్టరీ డే పరేడ్‌కు అనుమతి ఇవ్వలేమని బెంగళూరు పోలీసులు ఆర్సీబీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. నగరంలో భారీ ట్రాఫిక్ రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అంతేకాదు చిన్నస్వామి స్టేడియంలోకి ప్రవేశాన్ని కూడా పరిమితం చేశారు. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియంలో పరిమిత పార్కింగ్ స్థలం మాత్రమే ఉందని.. అభిమానులు మెట్రో, ఇతర ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక నగర వాసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ సీబీడీ ప్రాంతానికి దూరంగా ఉండాలని సూచించారు. ఆ మార్గంలో రాకపోలకు సాగించొద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు.
Also Read..
DK Shiva Kumar | ఆర్సీబీ ఆటగాళ్లు రాష్ట్రం గర్వించేలా చేశారు : కర్ణాటక డిప్యూటీ సీఎం
IPL 2025 | ఆర్సీబీ విన్నింగ్ మూవ్మెంట్స్.. ఫొటోలు మీరు చూసేయండి..!
IPL 2025: ఐపీఎల్ విన్నర్ ఆర్సీబీకి కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్, హరీశ్