హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025)లో .. మంగళవారం జరిగిన ఫైనల్లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఎన్నో ఏళ్లుగా వేచిన విరాట్ కోహ్లీ కల నెరవేరింది. అమోఘమైన విక్టరీ కొట్టిన ఆర్సీబీకి .. విషెస్ వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ విక్టరీపై స్పందించారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో రియాక్ట్ అయ్యారు. కింగ్ కోహ్లీ భావోద్వేగ కన్నీళ్లు ఆ మధుర విజయాన్ని చెప్పేస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీ కొట్టిన ఆర్సీబీకి, కోహ్లీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సడలని పట్టుదల, సంకల్పం, నిబద్ధతకు చీర్స్ కొట్టారు. చిట్ట చివరకు అద్భుత విజయాన్ని నమోదు చేసి ట్రోఫీని చేజిక్కించుకున్నారని ఆర్సీబీని కేటీఆర్ మెచ్చుకున్నారు.
King Kohli’s tears of joy say it all!
Heartfelt congratulations to @rcbtweets & @imvkohli on winning #IPL2025 after 18 long years of wait!
Cheers to your unwavering determination, commitment, and the ultimate triumph! 🏆 pic.twitter.com/vVXSz1eERZ
— KTR (@KTRBRS) June 4, 2025
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఆర్సీబీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీకి ఆయన కంగ్రాట్స్ చెప్పారు. 18 ఏళ్ల ఓపిక, సహనం ఫలించిందని, హార్డ్‌వర్క్ కలిసివచ్చిందన్నారు. మీ టీమ్ వర్క్ మీ కలను నిజం చేసిందన్నారు. ఎట్టకేలకే ఐపీఎల్ చాంపియన్స్ అయ్యారని ఎమ్మెల్యే హరీశ్ తన ఎక్స్ అకౌంట్లో వెల్లడించారు.
Congratulations RCB on winning IPL 2025!
After 18 years of patience and hard work, your teamwork made the dream come true. Champions at last 🏆#RCBFinal2025 #IPLFinals pic.twitter.com/TOymYVd9Vu
— Harish Rao Thanneeru (@BRSHarish) June 3, 2025