DK Shiva Kumar : ఐపీఎల్ సీజన్-2025 (IPL-2025) ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందని కర్ణాటక (Karnataka) డిప్యూటీ సీఎం (Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) అన్నారు. ఆర్సీబీ ఆటగాళ్లు (RCB players) కర్ణాటక రాష్ట్రం గర్వించేలా చేశారని పొగిడారు.
తాను మ్యాచ్ పూర్తిగా చూశానని, ఆర్సీబీ యువకులు అద్భుతంగా ఆడారని అన్నారు. కర్ణాటక ప్రజల తరఫున వారికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. తాము ఆర్సీబీ జట్టును స్వాగతిస్తున్నామని, వాళ్లను ఎలా గౌరవించాలనే అంశంపై మా పోలీసులు, ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నదని తెలిపారు.
తాను కర్ణాటక హోంమంత్రితో, పోలీసులతో మాట్లాడుతానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఆర్సీబీ టీమ్‌ను స్వాగతించే సందర్భంగా ట్రాఫిక్‌తోపాటు తదితర అంశాలను మేనేజ్ చేయాల్సి ఉందని, దీనిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఆర్సీబీ టీమ్ రాష్ట్రంలో అడుగుపెట్టగానే సంబురాలు చేసుకోవడం కోసం తాము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.