Mumbai Airport | జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai Airport)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ కారు డ్రైవర్లు, ఎయిర్పోర్ట్ సిబ్బంది (Mumbai airport staff) మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు రోడ్డుపై పడేసి మరీ కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు నిలిపే (parking) విషయంలో క్రిస్టల్ సెక్యూరిటీ సిబ్బంది (Krystal Security staff), పలువురు డ్రైవర్లకు మధ్య మాటల యుద్ధం సాగింది. మాటా మాటా పెరగడంతో అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కాలర్లు పట్టుకుని, రోడ్డుపై పడేసి పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘర్షణతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
ఈ ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ గొడవ కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎయిర్పోర్ట్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Freestyle WWF at Mumbai Airport between Drivers and airport staff. pic.twitter.com/wWuTuYIAOm
— Singh Varun (@singhvarun) June 4, 2025
Also Read..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. కూలిన 9 పాకిస్థానీ యుద్ధ విమానాలు
Kamal Haasan | కన్నడ భాషపై వివాదం.. రాజ్యసభ నామినేషన్ను వాయిదా వేసుకున్న కమల్ హాసన్
Spying | పాక్ కోసం గూఢచర్యం.. మరో యూట్యూబర్ అరెస్ట్