Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. కూలిన 9 పాకిస్థానీ యుద్ధ విమానాలు
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేళ 9 పాకిస్థానీ యుద్ధ విమానాలు కూలినట్లు ఓ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. వీటిల్లో ఆరు జెట్స్, ఓ సర్వియలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, ఓ సీ130 హెరిక్యూల్స్ ట్రాన్స్‌పోర్టు విమానం ఉన్నాయి.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఓ రిపోర్టు ప్రకారం ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు నేలకూలాయి. దీంతో పాటు రెండు హై వాల్యూ సర్వియలెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్, పది ఆర్మ్డ్ డ్రోన్లు, ఒకటి సీ-130 హెరిక్యూల్స్ ట్రాన్స్‌పోర్టు విమానం ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ వైమానిక, సైనిక దళానికి భారీగా నష్టం జరిగినట్లు అంచనా వేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో పాకిస్థాన్ వైమానికి దళానికి చెందిన విమానాలు నేలకూలినట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది.
రేడార్ ట్రాకింగ్, థర్మల్ సిగ్నేచర్ ద్వారా పాక్ విమానాలు కూలిన విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ మిస్సైల్ వ్యవస్థలు ఆ సిగ్నల్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. పేల్చివేత తర్వాత పాక్ విమానాలకు చెందిన ట్రాకింగ్ సమాచారం లభ్యంకావడంలేదన్నారు. నాలుగు రోజులు జరిగిన సమరంలో.. హై వాల్యూ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ కూల్చివేత కీలకమైందని పేర్కొన్నారు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వ్యవస్థను లాంగ్ రేంజ్ మిస్సైల్ సుదర్శన్‌తో చిత్తు చేసినట్లు చెప్పారు.
స్వీడన్ దేశానికి చెందిన ఎయిర్‌బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ను కూల్చినట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని బోలారి ఎయిర్‌బేస్‌లో ఆ సిస్టమ్ ఉన్నది. ఎయిర్ టు సర్ఫేస్ క్రూయిజ్ మిస్సైల్ దాడి ద్వారా దాన్ని నాశనం చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్ హౌజింగ్ ధ్వంసానికి చెందిన శాటిలైట్ చిత్రాలను రిలీజ్ చేశారు.
మరో ఆపరేషన్‌లో సీ-130 హెర్క్యూల్స్ విమానాన్ని కూల్చేశారు. పాకిస్తానీ పంజాబ్‌పై జరిగిన డ్రోన్ దాడిలో ఆ విమానం కూలింది. సీ-130ని లాజిస్టికల్ సపోర్టు కోసం వినియోగిస్తారు. ముల్తాన్ వద్ద ఆపరేట్ చేస్తున్న దాన్ని డ్రోన్ దాడితో కూల్చేశారు. రఫేల్, సుఖోయ్ 30 ద్వారా చైనాకు చెందిన వింగ్ లూంగ్ సిరీస్ డ్రోన్లను నేలకూల్చారు. సింగిల్ స్ట్రయిక్‌లో యూసీఏవీలను పేల్చినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌కు కౌంటర్‌గా ఆపరేషన్ బుయాన్ ఉన్ మార్సూస్‌ను పాకిస్థాన్ నిర్వహించింది. అయితే భారత్ అంచనా వేసిన దాని కన్నా అదనంగా మరో ఏడు ప్రాంతాల్లో పాక్‌కు నష్టం జరిగినట్లు ఆపరేషన్ బుయాన్ రిపోర్టు ద్వారా స్పష్టమైంది.
పెషావర్, జాంగ్, హైదరాబాద్(సింధ్), గుజరాత్, బహవాల్నగర్, అటోక్,చోర్ ప్రాంతానలు కూడా ఇండియా టార్గెట్ చేసినట్లు రిపోర్టు ద్వారా వెల్లడైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

