Siddhu Jonnalagadda | ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ‘టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఈ అంచనాలను అందుకోలేకపోయింది ఈ చిత్రం. దీంతో ఈ సినిమా వలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు భారీ నష్టాలను చవి చూశారు.
ఈ నేపథ్యంలోనే, ‘జాక్’ సినిమా నిర్మాతలకు జరిగిన నష్టంలో తన వంతు బాధ్యతగా సిద్ధు జొన్నలగడ్డ అరుదైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు తీసుకున్న పారితోషికంలో సగం, అంటే రూ. 4 కోట్ల రూపాయలను నిర్మాతలకు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘జాక్’ సినిమాకు సిద్ధు మొత్తం రూ. 8 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అందులో సగం తిరిగి ఇవ్వడం ద్వారా ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. అయితే ఈ వార్తలపై సిద్ధు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
కాగా, థియేటర్లలో పరాజయం పాలైనప్పటికీ, ‘జాక్’ సినిమా ఓటీటీలో మంచి స్పందన రాబడుతుంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘తెలుసు కదా’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు.
Read More