Botsa Satyanarayana | వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ (Botsa Satyanarayana) బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ (Vennupotu Day) నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కార్యకర్తలు ఆయన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో బొత్స పాల్గొన్నారు. ఎండవేడి ఎక్కువగా ఉండటంతో ఆయన వడదెబ్బకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. కాగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు ఆ పార్టీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరుతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.
Also Read..
Tirupati | తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
AP News | ఒంగోలులో మహిళపై పోలీసుల దాష్టీకం.. పక్కకు తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డ ఎస్సై