Allu arjun Vedam Movie | ఐకాన్ట్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాలలో వేదం ఒక్కటి. క్రిష్ (జాగర్లమూడి కృష్ణ) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2010 జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా వచ్చి నేటికి 15 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
వేదం సినిమా తన కెరీర్లో ఒక విభిన్నమైన చిత్రమని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఎంతో నిజాయితీగా తీసినందుకు దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రంలో తనతో పాటు నటించిన అనుష్క శెట్టి, మంచు మనోజ్, మనోజ్ బాజ్పాయ్తో పాటు ఇతర నటీనటులతో కలిసి పని చేయడం ఎంతో ప్రత్యేకమని అల్లు అర్జున్ చెప్పారు.
ఈ సినిమాను నిర్మించిన శోబు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేనికి, సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణికి, ఇంకా చిత్రబృందం మొత్తానికి అల్లు అర్జున్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చివరగా, ఈ సినిమాను ఆదరించి, ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా మార్చిన అభిమానులందరికీ అల్లు అర్జున్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
15 years of Vedam 🙏🏽
A film that was out of the box for me.
Gratitude to @DirKrish garu for crafting something so honest.
To my amazing co-stars @MsAnushkaShetty, @HeroManoj1 & @BajpayeeManoj sir , and many others . Sharing this journey with you all was truly special .… pic.twitter.com/fQ4VSGCcAd— Allu Arjun (@alluarjun) June 4, 2025
Read More |