మరికల్, జూన్ 04: మరికల్ మండల కేంద్రంలోని పాత కురువగేరిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయ అభివృద్ధి కోసం బుధవారం మరికల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లకాకుల అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు 25 వేల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన శివాలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా 25 వేల రూపాయలు ఇవ్వడంతో పాటు ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శివాలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజల సహకారంతో ముందుకు వెళ్తామని ఆలయ కమిటీ సభ్యులు సూచించారు. ఆలయానికి ఆర్థిక సాయం అందించిన అయ్యప్పను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మరికల్ పట్టణ వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు గొబ్బురు జగదీష్ , ఆలయ కమిటీ చైర్మన్ బస్వరాజ్, తిప్పయ్య, పోలేమాని రమేష్, తదితరులు పాల్గొన్నారు.