జయశంకర్ భూపాలపల్లి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్, డిస్మిస్ పేరిట చంద్రబాబునాయుడు వేలాది మందిని ఇంటికి పంపించారు. నేడు అతడి శిష్యుడు రేవంత్‌రెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారు. సింగరేణిలో జాతీయ సంఘాలు, నాటి పాలకులు కాలరాసిన వారసత్వపు ఉద్యోగాల హక్కును కేసీఆర్ కారుణ్యం పేరుతో పునరుద్ధరిస్తే నేడు బాబు శిష్యుడు మళ్లీ ఈ హక్కును పాతరపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కాగా, ఏడాది కాలంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. దీనికి తోడు ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నారు. భట్టి మాటలపై నల్లనేల భగ్గుమంటున్నది. ఆయన వ్యాఖ్యలపై సింగరేణి వ్యాప్తంగా కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. కాగా, భూపాలపల్లిలో నేడు టీబీజీకేఎస్ మహాధర్నాకు పిలుపునిచ్చింది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో సహా అగ్రనేతలు ఈ ధర్నాలో పాల్గొననున్నారు.
2018 మార్చి 9న కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియను ప్రారంభించి 115 మెడికల్ బోర్డులను ఏర్పాటు చేయించి, 13,119 మంది కార్మికుల పిల్లలను ఉద్యోగాల్లోకి తీసుకున్నది. అనంతరం రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాది క్రితం సింగరేణిలో గు ర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సింగరేణిలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేశా యి. 12 నెలలుగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల ను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. కాగా, డిప్యూటీ సీఎం భట్టి మాత్రం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు 13,119 మందిని కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగాల్లోకి తీసుకున్నారని, ఇందులో అవకతవకలు జరిగాయని పేర్కొం టూ విజిలెన్స్ విచారణ పేరిట బోర్డు ఏర్పాటు చే యకుండా ఆపడం వారి పనితీరుకు అద్దం పడుతున్నదని కా ర్మిక సంఘా లు మండిపడుతున్నాయి. 2025 మార్చిలో ఒక్క మెడికల్ బో ర్డు కూడా నిర్వహించలేదని, నెలకు 3 మెడికల్ బోర్డులు ఏ ర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాలతో సింగరేణి సంస్థ అభివృద్ధి కుం టుపడిందని కుంటి సాకులు చెబుతున్నారని, ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిల వల్లే సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు. సింగరేణిలో మారు పేర్లు సరి చేయ డం, విజిలెన్స్ అంశం, 2025 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేస్తూ నేడు టీబీజీకేఎస్, బీఆర్ఎస్ మహాధర్నా, రాస్తారోకో చేపట్టనున్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు అన్ని గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేస్తూ, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు సింగరేణి కార్మికులకు ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన గ్యారెంటీలపై నోరు మెదపడం లేదు. నూతన అండర్‌గ్రౌండ్ బొగ్గు గనులను ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.., సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.., సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం, రూ. 20లక్షల వడ్డీలేని రుణం, ప్రకృతికి విరుద్ధంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులకు చెల్లించే అలవెన్స్‌ల (పెర్క్) ఆదాయంపై ఇన్‌కమ్‌టాక్స్ యాజమాన్యం తో కట్టిస్తాం.., ఇప్పుడు ఉన్న అన్ని ఏరియా దవాఖానలను ఆధునీకరించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయిస్తాం.. మహిళా కార్మికులకు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి గౌరవప్రదమైన ఉద్యోగం (అండర్‌గ్రౌండ్ కు దింపకుండా) సర్పేస్లో ఇప్పిస్తామని ఇచ్చిన ఆరు గ్యారెంటీలు బుట్టదాఖలయ్యాయి.