బీఆర్ఎస్ తలపెట్టిన ‘గురుకుల బాట’ను కాంగ్రెస్ సర్కారు అడుగడుగునా అడ్డుకుంటున్నది. పేద విద్యార్థుల సమస్యలు తెలుసుకోనివ్వకుండా నిబంధనల పేరిట ఆటంకాలు సృష్టిస్తున్నది. మంగళవారం పలుచోట్ల విద్యాలయాల సందర్శనకు వెళ్లిన నాయకులను పోలీసులు, ప్రిన్సిపాళ్లు అడ్డుకోవడంపై ఆగ్రహం పెల్లుబుకింది. అయినప్పటికీ గేటు బయటి నుంచే విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. వాటర్ హీటర్ లేక చలికాలం చన్నీటి స్నానం చేయలేకపోతున్నామని.. మరుగుదొడ్ల సమస్య ఉన్నదని చెప్పుకొన్నారు.
మడికొండ, డిసెంబర్ 3 : గురుకులాల్లో అంతా బాగుంటే.. సమస్యలేవీ లేకపోతే అడ్డుకొని నిర్బంధించడం ఎందుకని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి రేవంత్ సర్కారు ను ప్రశ్నించారు. ‘గురుకుల బాట’లో భాగంగా మంగళవారం 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి, 2వ డివిజన్ కార్పొరేటర్ లావుడ్యా రవినాయక్‌తో కలిసి మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలుర పాఠశాలకు వెళ్లగా అనుమతి లేదంటూ ఇన్స్పెక్టర్ కిషన్ గేటు వద్దే అడ్డుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రాకేశ్‌రెడ్డితో పాటు సుమారు 50 మంది బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
10 నెలల్లో 49 మరణాలా?
అరకొర వసతులతో నిర్వహిస్తున్న గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురుకుల బాట చేపట్టినట్లు రాకేశ్‌రెడ్డి తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను ఆపడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు తమ వంతు సహాయం చేసేందుకే వచ్చాం తప్ప రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టంచేశారు. గతంలో తాము పాఠశాలల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, కానీ ఇంత నిర్బంధం ఎప్పుడూ చూడలేదన్నారు. దేశ చరిత్రలో ఎకడా లేని విధంగా 10 నెలల కాలంలోనే 49 మంది విద్యార్థులు మరణించారని, సుమారు 1,500 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకుల పాఠశాలల పిల్లలు హాస్టల్లో కంటే ఆస్పత్రుల్లోనే ఎకువగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. లోపల అంతా బాగుంటే అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు పాలన చేతకాక ఉపాధ్యాయులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నదని, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను గేటు దగ్గర కాపలా పెట్టడం దారుణమని మండిపడ్డారు. సమస్యలకు పరిషారం చూపకుండా ప్రభుత్వం తమను నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులాలు బాగయ్యే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని రాకేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎశబోయిన పురుషోత్తం, పాలమాకుల కొమురయ్య, పల్లపు అశోక్, పిన్నింటి విజయ్ కుమార్, గూడ హరీశ్, గువ్వ రాజేశ్, వసుల దేవేందర్, అరూరి తిరుపతి, రఘు, పల్లపు రాజకుమార్, మాచర్ల శ్రీధర్, బత్తిని కిరణ్, బోగి దేవేందర్, బోగి శ్రీను పాల్గొన్నారు.
జనగామలో బీఆర్ఎస్వీ నేతలను అడ్డుకున్న ప్రిన్సిపాల్
జనగామ చౌరస్తా, డిసెంబర్ 3 : విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు వె ళ్లిన బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గదరాజు చందు బృందాన్ని అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు విద్యార్థి నాయకులను హాస్టల్ లోపలికి అనుమతించలేదు. ఉన్నతాధికారుల పర్మిషన్ ఉంటేనే అనుమతించాలని పైనుంచి స్పష్టమైన ఆదేశాలున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో గేటు బయ టి నుంచే పలువురు విద్యార్థులతో బీఆర్ఎస్వీ నా యకులు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
చన్నీటి స్నానం చేయలేకపోతున్నాం..
ముఖ్యంగా మరుగుదొడ్ల సమస్యతో పాటు చలికాలంలో ఉదయం 5.30 గంటలకు చన్నీటి స్నానం చేయడం వల్ల 5, 6వ తరగతి విద్యార్థులకు వణుకు డు వస్తున్నదని, వాటర్ హీటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరారు. అలాగే కాస్మోటిక్ చార్జీలు ఇవ్వ డం లేదన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భో జనం అందిస్తుండగా, ఇటీవలే దుప్పట్లు పంపిణీ చే శారని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ ప్రధా న కార్యదర్శి చందు మాట్లాడుతూ గురుకులాల్లో భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో సమస్యల్ని తెలుసుకునేందుకు వెళ్తున్న తమను ప్రభుత్వం అడ్డుకోవడం సరైంది కాదన్నారు. కార్యక్రమం లో జనగామ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ మసిఉర్ రెహమాన్, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షుడు ఉల్లెంగుల సందీప్, మహ్మద్ యాకుబ్ పాషా, వంశీ, కిరణ్, చందు, జితేందర్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమిస్తాం..
పాలకుర్తి, డిసెంబర్ 3 : గురుకుల బాటలో భాగం గా పాలకుర్తి మండలం గూడూరులోని గిరిజన బాలికల పాఠశాలను బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నాయకులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటలను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా? అని ఆరా తీశారు. అనం త రం పాలకుర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లగా ప్రిన్సిపాల్ లోనికి అనుమతించకపోవడంతో బీఆర్ఎస్వీ నాయకులకు ప్రిన్సిపాల్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్సై దూలం పవన్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందడం లేదని.. గురుకులాలు బాగయ్యే వరకు సమస్యలపై ఉద్యమిస్తామని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయ్, జిల్లా అధ్యక్షుడు కందుకూరి ప్రభాకర్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు ఒంటెల మాధవి, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పోశాల పవన్ గౌడ్, కారుపోతుల వేణు, బానోత్ మహేందర్, పొన్నం యాకయ్య, గుగ్గిళ్ల యాకయ్య, రామస్వామి, కోల నారాయణ పాల్గొన్నారు.