(హనుమకొండ)ఐనవోలు : క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. మండల కేంద్రంలో యువత ఆధ్వర్యంలో ర్వహించిన ఐనవోలు క్రికెట్ ప్రీమియర్ లీగ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులను ఇందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధింవచ్చని పేర్కొన్నారు.
ఆటల్లో గెలుపోటలములు పట్టుంచుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధననే ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థాన చైర్మన్ మునిగాల సంపత్‌కుమార్, మాజీ సర్పంచ్ జన్ను కుమారస్వామి, మండల నాయకులు డబ్బా శ్రీను, కొత్తూరి సునీల్, రాజిరెడ్డి, పరమేశ్, పల్లకొండ కుమార్, భాను ప్రసాద్, పులి శ్రీనివాస్, వెంకట్ దితరులు పాల్గొన్నారు.