హనుమకొండ చౌరస్తా/వరంగల్ చౌరస్తా, జనవరి 11 : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించడంతో శనివారం స్వగ్రామాలకు చేరుకునేందుకు వచ్చిన వారితో హనుమకొండ, వరంగల్ బస్స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.
33
ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో 660 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రజలకు ఎదురుచూపులు తప్పలేదు. గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని, స్టేషన్లలో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపిక లేక కొందరు ప్రయాణికులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా ఇదే అదునుగా వారు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.