పరకాల, సెప్టెంబర్ 14: కాంగ్రెస్ పార్టీ లో చేరలేదనే నెపంతో సొసైటీ చైర్మన్లను తొలగిస్తున్నారని, ఇది దుర్మార్గపు చర్య అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. ఆదివారం హనుమకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగించిన ఆగస్టు 14 నుంచే ఇతర పార్టీలకు చెందిన చైర్మన్లను కాంగ్రెస్లో చేరాలని అధికా ర పార్టీ నాయకులు, అధికారులు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
అయినా పార్టీ మారని చైర్మన్లను పొం తనలేని సాకులతో తొలగించడం ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రూ. 2 లక్షల వరకు తీసుకున్న రైతుల రుణాలను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్న రేవంత్రెడ్డి మాటలు నమ్మి వాటిని సొసైటీ సభ్యులు చెల్లించలేదని, ఇప్పుడు ఆ డబ్బులే బాకీ ఉన్నారని తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత మంది రైతులకు రుణా లు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే ఇప్పుడున్న పాలకవర్గాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వానికి సవాలు విసిరా రు. కాంగ్రెస్ నేతల మెప్పుకోసం అధికారులు పాలవర్గాలను బెదిరించడం సబబు కాదన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. వ్యవసాయానికి సరిపడా యూరియా అందివ్వలేని చేతకా ని ప్రభుత్వానికి రైతుల ఉసురు తాకుతుందన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్లు గుండెబోయిన నాగయ్య, నలెల్ల లింగమూర్తి పాల్గొన్నారు.