సుబేదారి : గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు గంజాయిని సేవించిన బాలుడితో సహ మరో ఆరుగురుని హన్మకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసారు. వీరి నుంచి సుమారు 180గ్రాముల గంజాయితో పాటు ఒక సెలఫోన్, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. ఏసీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
భూపాలపల్లి జిల్లాకు చెందిన మోతే మణికంఠ(25), కోటగిరి రోహిత్(25) సులభంగా డబ్బు సంపాదనకోసం ద్విచక్ర వాహనంపై ఒడిషా వెళ్లారు. అక్కడ నాగరాజు అనే వ్యక్తి వద్ద ఆర కిలో గంజాయి కొనుగోలు చేసారు. కోనుగొలు చేసిన గంజయిలో రోహిత్ కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. మిగితా గంజాయిని మరో నిందితుడు మోతే మణికంఠ విక్రయించేందుకు హనుమకొండకు వచ్చాడని తెలిపారు. పోలీసులకు అందిన సమచారం మేరకు మణికంఠను పోలీసులు అదుపులో తీసుకొని బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో గంజాయిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు.
నిందితుడు ఇచ్చిన సమాచారం గంజాయి వియ్రించిన మరో నిందితుడు రోహిత్‌తో పాటు, గంజాయిని కొనుగోలు చేసిన బాలుడితో పాటు మేకల అవినాష్, శనిగరపు అభిలాష్, కాంతాల రాజిరెడ్డి, ఓదెల అరుణ్‌లను అరెస్టు చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు నాగరాజు, తాళ్లపెల్లి చిన్ను ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్.ఐ పరశురాములు, అడ్మిన్ ఆశోక్‌కుమార్, కానిస్టేబుల్ అనిల్, సతీష్, కిరణ్‌లను ఏసీపీ అభినందించారు.