‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అన్న రోజులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలతో ప్రభుత్వ వైద్యశాలలు బలోపేతమయ్యా యి. ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేలా వైద్యులు, మందుల కొరత లేకుండా అత్యాధునిక వసతులతో పేద ప్రజలకు వైద్యం అందించాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే పాలకుల నిర్లక్ష్యం వల్ల సర్కారు దవాఖానల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. రోగులకు సరిపడా మందులు అందించలేని స్థితి చేరుకున్నాయి.
– మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) / వరంగల్ చౌరస్తా/ జనగామ చౌరస్తా/ ములుగురూరల్/ భూపాలపల్లి రూరల్/ మహదేవపూర్
సగం మందులు బయటనే..
మహబూబాబాద్ జిల్లా వైద్యశాలకు వచ్చే రోగులు వై ద్య పరీక్షలు మొదలు మందు ల వరకు అన్నీ బయటనే కొనుగోలు చేయాలి. దవాఖానలో గుండె, కంటి, దంత సం బంధిత వైద్య నిపుణులు లేరు. విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్లు అరకొరగా మందులు రాసి పంపిస్తున్నా రు. వీటిలో కొన్ని రకాల మందులు దవాఖానలో లభిస్తుండగా, మరికొన్ని ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తున్నది. వీటికోసం సగటు రోగి రూ.500 నుంచి రూ.1500 వరకు ఖర్చు చేయాల్సివస్తున్నది.
కేసముద్రం మండలం ఉత్తరతండాకు చెందిన కమిలి కంటి నొప్పితో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వచ్చింది. కంటి వైద్యనిపుణుడు లేకపోవడంతో అకడున్న వేరే డాక్టర్ చూసి రెండు రకాల ఐ డ్రాప్స్ రాశాడు. ఇందులో ఒకటి దవాఖానలోనే ఇవ్వగా, మరో రకం డ్రాప్స్ బయట కొనుగోలు చేసింది.
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బానోత్ వెంకన్నకు గతంలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నా ఇటీవల వ్యవసాయ పనులు చేస్తుండగా కాలికి దెబ్బతగలగా, ప్రభుత్వ దవాఖానకు వచ్చాడు. డాక్టర్ పరీక్షించి కొన్ని మందులు రాశాడు. ఎన్నిసార్లు వచ్చినా అవే మందులు ఇస్తుండడంతో నొప్పి తగ్గడం లేదని ఆ చిట్టిని అక్కడే వదిలేసి ప్రైవేటు దవాఖానకు వెళ్లాడు.
నెల్లికుదురు మండలం ఆలేరుకు చెందిన ఆంగోత్ భూలక్ష్మి పంటినొప్పితో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆరు రకాల మందులు రాశారు. వీటిలో మూడు రకాల మందులు ఆసుపత్రిలో లభించగా, మరో మూడు రకాలు బయట కొనుగోలు చేసింది. దీంతో ఆమెకు రూ.1500ల బారం పడింది.
మందులు లేక బయటతెచ్చుకుంటున్న ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (వంద పడకల దవాఖాన) జిల్లాకే పెద్ద ఆసుపత్రి. కానీ, వైద్యసేవలు మాత్రం అంతంత మాత్రమే. డాక్టర్లు సమయానికి రారు.. వచ్చిన డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి మందులు రాస్తే, అన్నీ అందుబాటులో ఉండవు. కొన్ని మందులు బయట కొనాల్సిన పరిస్థితి. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ప్రతి రోజూ వైద్య సేవల కోసం సుమారు 500 మంది వస్తుంటారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే పేద ప్రజలు ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ, డాక్టర్లు మాత్రం 10.30 గంటలకు కూడా రాకపోవడంతో ఓపీ తీసుకున్న పెషంట్లకు ఎదురుచూపులు తప్పలేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా 10.30గంటల వరకు విధులకు హాజరు కాలేదు. చాలాచోట్ల డాక్టర్లు రాక ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మందుల కొరత
జనగామ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు చంపక్ హిల్స్ ఎంసీహెచ్ దవాఖానలో మందుల కొరత ఉంది. జ్వరం, జలుబు, దగ్గు, నొప్పులు, బలహీనతతో వచ్చే రోగులకు ఇచ్చే మందులు అరకొరగా ప్రభుత్వం సప్లయ్ చేస్తుండడంతో బయట కొనుగోలు చేస్తున్నారు. జ్వరం తగ్గడానికి ప్యారాసిటమిల్తో కలిపి ఇచ్చే యాంటీ బయాటిక్స్, నొప్పులకు ఇచ్చే డైక్లోఫిన్, దగ్గు తగ్గడానికి ఇచ్చే అంబ్రాక్సిల్ సిరప్, సిఫ్రోప్లాక్సిన్, సిఫిక్సిమ్, బల హీనత నివారణకు ఇచ్చే బీ కాంప్లెక్స్, మల్టీ విటమిన్ వం టి మందులతోపాటు కొన్నిసార్లు అత్యవసరంగా ఇచ్చే మందులు, ఇంజెక్షన్లు, ఆపరేషన్ థియేటర్లో ఉపయో గించే కాటన్ కూడా అందుబాటులో ఉండడం లేదు.
లేనివి టిక్ చేసి పంపిస్తున్నారు..
ఏజెన్సీ ప్రాంతానికి సంజీవిని లాంటి ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖానలో సరిపడా మందులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటల దవాఖానకు వచ్చి, ఓపీ తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లి అవస్థలను చెప్పి మందులు రాయించుకొని ఫార్మసీ వద్దకు వెళితే మొత్తం మందులు ఇవ్వడం లేదు. ఉన్న కొద్దిపాటి మందులను ఇచ్చి, లేని వాటికి టిక్ చేసి బయట కొనుక్కొవాలని సూచిస్తున్నారని పలువురు చెబుతున్నారు. పేరుకే పెద్ద దవాఖాన.. కానీ, ఇక్కడ ఓపీ తప్పా మిగతావన్నీ బయట కొనాల్సిందేనని అంటున్నారు. రోజువారీగా రోగులకు మందుల పంపిణీ జరుగుతున్న తీరును మాత్రం పరిశీలించడం లేదని వాపోతున్నారు. ఏటూరునాగారం సీహెచ్‌సీతోపాటు పీహెచ్‌సీల్లో కూడా ఇదే పరిస్థితి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం దవాఖానలో మందులు లేవని చెప్పుతున్న ఫార్మసీ అధికారు లు.., కాలం చెల్లిన మందులను కుప్పలు తెప్పలుగా దవాఖాన వెనుక కాల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
యాంటీ బయాటిక్స్ కొరత
వరంగల్ ఎంజీఎం దవాఖాన, సీకేఎం ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్, ప్రాంతీయ నేత్ర వైద్యశాలల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నది. సాధారణంగా వినియోగించే మందులు మాత్రమే అందిస్తున్నారు తప్ప.. అత్యవసర సమయాల్లో అందించే యాంటీ బయాటిక్స్ తగినన్ని నిల్వలు లేని కారణంగా రోగులకు అందించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రైవేటుగా కొనుక్కొని వాడాలని వైద్యులు రోగులకు సూచిస్తున్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో అత్యవసర విభాగంలో అవసరానికి తగిన మందులు లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడుకోవడం కోసం ప్రైవేట్ మందులు కొనుగోలు చేయక తప్పడం లేదు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో మల్టీ విటమిన్ మందు లు అందుబాటులో ఉన్నా, కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు ఇవ్వడానికి తగినన్ని యాంటీ బ యాటిక్స్ మందులు అందుబాటులో లేవు. సీకేఎం దవాఖానలో సైతం ఇదే పరిస్థితి. గర్భిణుల్లో పిండం ఎదుగుదల, రక్తహీనత తగ్గించడానికి వినియోగించే కాల్షియం, ఐరన్, విటమిన్ బీ, విటమిన్ సీ, ఫోలిక్‌యాసిడ్ మాత్రలు మాత్రమే అందుబాటులో ఉ న్నా యి. పేషెంట్ శరీర స్థితిని బట్టి శస్త్రచికిత్స సమయంలో అవసరమయ్యే యాంటీబయాటిక్స్ మందులు
సానింగ్ బయటకు రాశారు..
కడుపునొ ప్పితో వారం క్రితం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను. డాక్టర్ లేడు. శనివారం రమ్మని చెప్పారు. డాక్టర్ చెక్ చేసి సానిం గ్ తీసుకురావాలని బయటకు రాశాడు. ప్రైవేట్‌లో సానింగ్, రిపోర్టు పట్టుకొని డాక్టర్ వద్దకు పోతే ఆరు రకాల మందులు రాశాడు. ఇందులో నాలుగు రకాలు ఇవ్వ గా, ప్రైవేటు మెడికల్ షాపులో రెండు రకాలు కొనుగోలు చేశాను. రూ.600ల నుంచి రూ.800ల వరకు ఖర్చు అయింది. – ఇస్లావత్ సత్తెమ్మ, మహబూబాబాద్
అన్ని మందులు ఇస్తలేరు..
ఆరోగ్యం బాగాలేక ములుగు ప్రభుత్వ దవాఖానకు వచ్చాను. డాక్టర్ చూసి మందులు రాసి ద వాఖానలోనే తీసుకొమ్మని చె ప్పారు. ఫార్మసీ కాడికి వెళితే అ న్ని మందులు లేవు.. ఉన్నవే ఇ స్తాను.. మిగతావి బయట కొనమన్నారు. డాక్టర్ అన్ని మందులు ఇక్కడే తీసుకొమ్మారని అంటే లేవనే సమాధానమే మళ్లీ చెప్పారు. చేసేదేమీ లేక ఇచ్చిన మందులను తీసుకొని లేని మందులను బయట కొన్నా.
– గోల్కొండ రమేశ్, మల్లంపల్లి మండల వాసి
సిమెంట్ పట్టి బయట తెచ్చుకున్న..
వాలీబాల్ ఆడుతుండగా చేతి మణికట్టు వద్ద బెణికింది. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వచ్చిన. డాక్టర్ పరీక్షించి మందు లు, సిమెంటు పట్టి రాశా డు. మెడికల్ వార్డుకు వెళ్లితే మందులు మాత్రమే ఇచ్చి, సిమెంట్ పట్టి బయట తెచ్చుకొమన్నారు. ప్రైవేట్ మెడికల్ షాపునకు వెళ్లి రూ.600 చెల్లించి సిమెంట్ పట్టి తెచ్చుకున్నా. అన్ని రకాల మందులు దవాఖానలో అందుబాటులో ఉంచాలి. లేకపోతే మాలాంటి పేదలం ఆర్థికంగా ఇబ్బందిపడుతాం.
– ఎస్ రావన్, జంగేడు, భూపాలపల్లి
లేని మందులకు టిక్ చేసి పంపిస్తున్నారు..
కన్నాయిగూడెం మండలం తుపాలగూడెం గ్రామం. నా బిడ్డ ఇక్కడే 8వ తరగతి చదువుతున్నది. జ్వరం, జలుబు వస్తే ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చా. డాక్టర్‌కు చూపిస్తే మందులు రాశారు. ఫార్మసీకి వెళితే.. వాటిలో ఒక రకం మెడిసిన్ లేదని, బయట తీసుకోవాలని టిక్ చేశారు. చేసేదేమీ లేక బయట తీసుకున్న. ప్రభుత్వం నుంచి మందులు సరఫరా కాకుంటే వాళ్లు మాత్రం ఏం చేస్తారు. ఉన్న మందులనే ఇచ్చి పంపుతున్నారు.
– కుమార్తె నాగశరణ్యతో తండ్రి భాస్కర్, తుపాకులగూడెం