హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్లో నిధులు పెం చాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో కార్మికుల తరఫున డిమాండ్ చేయనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిషరించాలని ఏఐటీయూసీ అనుబంధ సంఘం మధ్యా హ్న భోజన పథకం వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ వద్ద యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేంపావని అధ్యక్షతన ధర్నా జరిగింది.
కూనంనేని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. 24 ఏండ్లుగా తకువ వేతనం ఇస్తూ ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకోవడం అన్యాయమన్నారు. వంట కార్మికులకు సీపీఐ మద్దతు ఉంటుందని చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. వంట కార్మికులకు కోర్టు తీర్పు ప్రకారం రూ.17 వేల వేతనం అమలుచేయాలని, పీఎఫ్, ఈ ఎస్ఐ కల్పించాలని, బీమా వర్తింపజేయాలని చేయాలని డిమాండ్ చేశారు.