సంగెం, మార్చి 20 : సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం సంస్థ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. సంగెంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి జై కేసీఆర్, జైజై కేసీఆర్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. పే స్కేల్ నిర్ణయం చారిత్రాత్మకమని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎం కిషన్, సీసీలు బొజ్జ సురేశ్, కుమారస్వామి, స్వరూపారాణి, కృష్ణమూర్తి, సదిరం రాజయ్య, మండ కృష్ణ, తండా సుజాత పాల్గొన్నారు.
గీసుగొండ : సీఎం కేసీఆర్ చిత్రపటానికి ప్రగతి మండల సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డి అశోక్ మాట్లాడుతూ.. సెర్ప్ ఉద్యోగులపై గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ దయాకర్, సెర్ప్ ఉద్యోగులు రవీందర్, శ్రీనివాస్, అనిత, భవాని, ఏపీఎం సురేశ్‌కుమార్, సీసీలు కుమారస్వామి, శోభ, సుజాత, యాదగిరి, వనమ్మ, దేవేంద్ర పాల్గొన్నారు.