హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 8: ఈనెల 9 నుంచి 11 వరకు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్(మహిళల) టోర్నమెంట్‌కు విశ్వవిద్యాలయ టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు.
వీరిలో విశ్వవిద్యాలయ వ్యాయమ కళాశాల నుంచి ఎం.శ్వేత, కొత్తగూడెం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పి.వర్షిత, వరంగల్ కిట్స్ కాలేజీ నుంచి ఎం.వర్షిత, పి.శ్రావణి, వరంగల్ ఈస్ట్ టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ(డబ్ల్యూ) నుంచి ఎం.నందిని ఉన్నట్లు వివరించారు. వీరికి కోచ్ కం మేనేజర్‌గా జనగాం ఏబీవీ డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ టి.కళ్యాణి వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.