కేసముద్రం/నెల్లికుదురు, ఏప్రిల్ 11: ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కేసముద్రం, నెల్లికుదురు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో శుక్రవారం రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ డోర్నకల్‌లో రూ. వంద కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు ప్రారంభోత్సవం చేసినా ఇంత వరకు డీపీఆర్ లేదన్నారు. కేసీఆర్‌కు ప్రజలే హైకమాండ్ అని, వారి ఆలోచన విధంగానే పరిపాలన చేశాడని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, దీంతో కేంద్రం నుంచి నిధులు రాక అభివృద్ధి కుంటుపడి పోయిందన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం చెబుతాడోనని నాలుగున్నర కోట్ల ప్రజలు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారని సత్యవతి పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రజతోత్సవ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు ఓలం చంద్రమోహన్, ఎర్రబెల్లి మాధవి, రావుల శ్రీనాథ్‌రెడ్డి, మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పరుపాటి వెంకట్ రెడ్డి, నజీర్ అహ్మద్, కార్యదర్శి కముటం శ్రీని వాస్, ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జాటోత్ హరీశ్‌నాయక్, శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు బత్తిని అనిల్, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు బానోత్ బీముడు, నాయకులు నీలం దుర్గేశ్, మోడెం రవీందర్‌గౌడ్, సట్ల వెంకన్న, బొబ్బిలి మహేందర్‌రెడ్డి, అన్నెపాక వెంకన్న, లింగాల పిచ్చయ్య, గందసిరి సోమన్న , తొనుపునూరి సాయి, చిర్ర యాకాంతం గౌడ్, కాసం వెంకటేశ్వర్ రెడ్డి, పులి రామచంద్రు, గొట్టిముక్కల ఆదిరెడ్డి, వీరగాని మల్లేశ్, భోజ్యానాయక్, ప్రభాకర్ రెడ్డి, కొమ్ము అనిల్, బొడ్గం చంద్రారెడ్డి, నల్లాని నవీన్ రావు, బోజ్యా నాయక్, బిక్కునాయక్, కసరబోయిన విజయ్ యాద వ్, ఎడ్ల మహేశ్, యాద రాజు ఉన్నారు.