డోర్నకల్ , ఆగస్టు 24 : రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరి నాట్లు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం రోజంతా బారులుతీరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని బీఆర్ఎస్ నాయకుడు మాన్యు పాట్నీ నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్న తో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశాఉ. షెడ్యూల్-9లో చేర్చి బీసీలకు 42 శాతం రిజ్వరేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. యూరియా నిల్వలపై మంత్రి తుమ్మల నాగేశ్వరావు అవగహన లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ హైదరాబాద్‌లో ఉంటూ వాట్సప్‌లో వీడియోలు పోస్టు చేస్తున్నారని నియోజక వర్గ ప్రజల ఓట్లతో గెలిచి వారి సమస్యలు గాలికి వదిలి వేశాడన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి పట్టిం పు లేదా? అని ప్రశ్నించారు. డోర్నకల్ ప్రజలు న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదన్నారు. డోర్నకల్ సీఐ రాజేశ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాడెండ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారని పేర్కొన్నారు. జిల్లా లో బెల్లం, గంజాయి, గుట్కా, ఇసుక తదితర దందాలు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. ఆగస్టు నెల ముగిసిపోతున్నా రైతులకు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు అందడం లేదని సత్యవతి ఆవేద న వ్యక్తం చేశారు. ఆమె వెంట నాయకులు కాలా యశోధర్ జైన్, మారబోయిన రాంభద్రం, బోడ శ్రీను, కందుల మధు, చంటి, గౌస్, ఐక్యరాజ్, వినయ్, సునీల్ తదితరులున్నారు.