Collector Sathya Sharadha | ఖిలా వరంగల్, ఫిబ్రవరి 22 : జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ (డాక్టర్) సత్య శారద (Sathya Sharadha) అధికారులను ఆదేశించారు. ఇవాళ వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఎం శ్రీ పథకం కింద మొదటి విడుతలో 10 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన రూ.2,74,15,000 నిధులతో పాఠశాలల్లో ఎల్ఈడీ లైట్లు, పాఠశాలలో పచ్చదనం, వర్మి కంపోస్ట్, కిచెన్ గార్డెన్లు, వివిధ రంగులతో కూడిన డస్ట్ బిన్లు, స్వచ్ఛత పక్వాడ, స్వచ్ఛతనం, వైజ్ఞానిక క్షేత్రస్థాయి సందర్శనలు తదితర అంశాలను ప్రణాళికబద్ధంగా వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
అలాగే రెండవ విడతలో పీఎం శ్రీ పథకం కింద 6 ప్రభుత్వ పాఠశాలలకు రూ.20,25,500 మంజూరైనట్లు చెప్పారు. త్వరిత గతిన పనులు పూర్త చేయాలన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వర్మి కంపోస్టులు, ఇంకుడు గుంతల ఏర్పాటు, జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రెడ్కో సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమన్వయంతో మార్చి మొదటి వారంలోపు ఆయా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో కౌసల్యాదేవి, డీహెచ్వో సంగీతలక్ష్మి, డీఈవో జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి