సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం
సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు చేయడంతో బండారం బట్టబయలైంది.
- రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయం
- ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో దందాను బట్టబయలు చేసిన అధికారులు, పోలీసులు
- రూ. 81 వేల విలువైన మందులు సీజ్.. ఇద్దరిపై కేసు నమోదు
వరంగల్ చౌరస్తా, మార్చి21: సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్‌ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు చేయడంతో బండారం బట్టబయలైంది. పోలీసులు, డ్రగ్ కంట్రోలర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తలకోటి నరేందర్ (ఈనాడు మాజీ రిపోర్టర్) వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ఓపీ ఫార్మాసిస్ట్‌గా సుమారు 33 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. దవాఖానలో ఎక్కువ మంది ఓపీ సేవలు వినియోగించుకున్నట్లు, వారికి వైద్య పరీక్షల అనంతరం వైద్యులు సూచించిన మందులను రెండింతలు నమోదు చేసి ఉచితంగా పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశాడు. మిగిలిన మందులను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు చెందిన బలరాందాసు ద్వారా బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నాడు. బుధవారం వరంగల్ జిల్లా డ్రగ్ కంట్రోలర్ అరవింద్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఇంతేజార్గంజ్ పోలీసుల సహకారంతో నిర్వహించిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు తలకోట నాగేందర్, బలరాందాసును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పక్కదారి పట్టించిన మందులను కాశీబుగ్గలో నిల్వ చేసి అక్రమంగా బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు తేలింది. రూ. 69,360 విలువైన 34 బాక్సుల యాంటీ బయాటిక్ టాబ్లెట్స్, రూ. 11, 484 విలువైన 240 కంటి చుక్కల మందు బాటిల్స్, మొత్తం సుమారు రూ. 80, 844 విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం
ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఓపీ ఫార్మాసిస్ట్ బాగోతం బట్టబయలు కావడంతో హాస్పిటల్లో అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం కంటి పరీక్షలు నిర్వహించి, రోగు లకు అందించే మందుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉన్నా అధికారులు తగిన శ్రద్ధ చూపకపోవడంతోనే మందులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా మందులు పక్కదారి పడుతున్నా గుర్తించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపి మందులు బహిరంగ మార్కెట్‌కు తరలకుండా చూడాలని రోగులు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్‌కు కామ్రేడ్ల షాక్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న సీపీఎం, సీపీఐ
ఈహెచ్ఎస్ ఉన్నా.. అందని నగదురహిత వైద్యం
సింథటిక్ మాంజా విక్రయిస్తే లైసెన్స్ రద్దు
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లేవి?.. నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం
పాఠాలు బంద్‌పెట్టి.. ఆచార్యుల ర్యాలీ.. వీసీకి మద్దతుగా జేఎన్టీయూలో ర్యాలీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

