ఖిలావరంగల్: అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఎంసీపీఐ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ అన్నారు. బుధవారం ఎంసీపీఐ ఆధ్వర్యంలో ఖిలావరంగల్ తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్ధార్ టీ శ్రీకాంత్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. 6 గ్యారంటీలు ఖిలావరంగల్ మండల పరిధిలోచాలా కుటుంబాలకు అమలు కావడం లేదన్నారు.
అర్హులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన బిల్లులు రావడం లేదన్నారు. ఇటీవల కాలంలో అకాల వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గుడిసెలు నీట మునిగి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, కొన్ని ఇండ్లు కూలిపోయాని తెలిపారు. మండల ప్రాంతంలో యూరియా దొరకక రైతులు అనేక అవస్థలు పడుతున్నారన్నారని తెలిపారు. అలాగే కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు నగదు, తులం బంగారం ఎక్కడ అమలు కావడం లేదని, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మండల పరిధిలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓదెలు , నగేష్, మల్లికార్జున్, ప్రభాకర్, రవి, ప్రత్యూష, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే మోదీ ప్రభుత్వం పత్తిపై 11 శాతం తిగుమతి సుంకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి 50 శాతం సుంకం విధించాలని కోరుతూ ఎస్కేఎం పార్టీ ఆధ్వర్యంలో ఖిలావరంగల్ తహసీల్ధార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచర్ల బాలరాజు, నగేష్, పాణి, ఎల్లయ్య, రాజేందర్ తదితరులున్నారు.