అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘నాకు జన్మనిచ్చిన ఊరు చెల్పూర్లో ఉండే ప్రతి ఒక్కరూ నా తోబుట్టువుగా భావించి గ్రామానికి అనేక నిధులు సమకూర్చి అభివృద్ధి పథంలో నిలిపానన్నారు. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పట్టణాలకు దీటుగా పల్లెలను తయారు చేసుకున్నామని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి మరింత అభివృద్ధికి పట్టం కట్టాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, మ్యాఫెస్టోలోని ప్రతి అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
గణపురం, అక్టోబర్ 19: రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి పట్టం కట్టాలని భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, బస్వరాజుపల్లి, గొల్లపల్లి, లక్ష్మారెడ్డిపల్లి, గాంధీనగర్, మైలారం, బుర్రకాయలగూడెం, గణపురం, చెల్పూర్, గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘నాకు జన్మనిచ్చిన ఊరు చెల్పూర్లోని ప్రతి ఒక్కరూ నా తోబుట్టువులుగా భావించి గ్రామానికి అనేక నిధులను సమకూర్చి అభివృద్ధి పథంలో ఉంచామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక నాయకుల సహకారం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మండలంలోని గ్రామాలతోపాటు చెల్పూర్ గ్రామాన్ని ప్రత్యేకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు నిర్మోహమాటంగా ఓటు అడిగే హక్కు ఉందని, అభివృద్ధి చేసిన పార్టీని ఆదరించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో మండలంలోని ప్రతి ఒక్కరూ అభ్యర్థిగా భావించి ప్రజల వరకు వెళ్లి ఓట్లు అడగాలని కోరారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి పట్టణాలకు దీటుగా పల్లెలను తయారు చేసుకున్నామని తెలిపారు.
సమైక్య పాలనలో కరువు కాటకాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మేనిఫెస్టోలోని పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరేలా విస్తృత పర్యటనలు, ప్రచారాలు నిర్వహించాలన్నారు. భూపాలపల్లి పట్టణానికి అతి సమీపంలో ఉన్న గ్రామం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్న గ్రామమని, అతిపెద్ద గ్రామంలో అత్యధిక మెజార్టీ వచ్చేలా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూస్తూ ప్రజలకు అవసరమైన అనుకూలమైన పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, తెలంగాణ నలుమూలల తెలిసిన వ్యక్తిగా మేనిఫెస్టో ప్రవేశపెట్టారని, ప్రతి అంశం అమలుకు ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టే ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టాలన్నారు. సమావేశంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్‌రెడ్డి, సర్పంచులు నడిపెల్లి మధుసూదన్‌రావు, నారగాని దేవేందర్‌గౌడ్, చెరుకు కుమారస్వామి, తోట మానసా శ్రీనివాస్, ఆగమ్మ, అరుణా తిరుపతిరావు, రజితా బాబు, ఎంటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పరశురాంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ యూత్ కార్యకర్తలు ఉడుత రాజేంద్రప్రసాద్, బాలరాజు, హనుమాండ్ల రాజు, కార్తీక్, శ్రీనివాస్, పీ దేవేందర్, సీహెచ్ దేవేందర్, పున్నం, ఈ గణేశ్, శరత్, యూ గణేశ్, సంజయ్, చంద్రమౌళి, కిరణ్, శ్రావణ్, రాజు, శ్రీదర్, రవి చేరారు. వారికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వెంకటేశ్వర్లపల్లి, గాంధీనగర్ నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
రేగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి బీఆర్ఎస్ ఆభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి విజయం కోరుతూ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పట్టేం శంకర్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్మించిన పాటల సీడీని ఘనపురం మండల కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో రేగొండ మండల బీఆర్ఎస్ ఆధ్యక్షుడు అంకం రాజేందర్, నాయకులు సామాల పాపిరెడ్డి, గంపల లింగయ్య, సురేందర్ పాల్గొన్నారు.