ఏటూరునాగారం, మే 13 : ‘మన ఊరు-మన బడి’లో ఇంగ్ల్లీషు మీడియంతో మౌలిక వసతులు పెరగనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పోరేట్ తరహాలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఇంగ్లిషు మీడియంను కూడా ప్ర వేశ పెట్టేందుకు సంకల్పించింది. దీంతో మండలంలోని 11 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మూత్ర శాల లు, వంట గదులు, డైనింగ్ హాల్స్, తాత్కాలిక మరమ్మతులు, ఫర్నీచర్, విద్యుద్ధ్దీకరణ, పెయింటింగ్, తాగునీటి సరఫరా, మేజర్, మైనర్ రిపేర్లకు నోచుకోనున్నాయి.
పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవసరమైన ప్రతిపాధనలు సిద్ధం చేసి మంజూరు కోసం నివేదించారు. అంతా ఆన్లైన్లో ప్రతిపాదనలు పంపించారు. కాగా, మండలంలో11 పా ఠశాలల్లో పనులు చేపట్టేందుకు రూ. 3.55 కోట్లతో ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో అనుమతి లభించింది. పనులు కూడా ప్రారంభించేందుకు శ్రీకా రం చుట్టారు. అంతకు ముందు జీవో 317లో మూత పడిన పాఠశాలలకు జీవం పోశారు. ఒక్క ఏటూరునాగారం మండలంలోనే సుమారు 35 మంది ఉపాధ్యాయులు కొత్తగా వచ్చారు. దీంతో ఉపాధ్యాయుల కొరత పాఠశాలలో సింహభాగం తీరింది. ఇక పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చి వేయడంతో పాటు ఆయా పాఠశాల భవనాలు స్థితిగతులు, మంజూరైన నిధులను బట్టి పనులు చేపట్టనున్నారు. పాఠశాలల్లో అవసరమైన ఫర్నీచర్ కూడా తీసుకునే అవకాశం లభించనుంది. దీనికి తోడు పాఠశాలల్లోని ఉపాధ్యాయులుకు ఇంగ్లిషు మీడియంలో బోధనపై తర్ఫీదు ఇచ్చారు. మెలకువలు నేర్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల హంగులు మారడంతో పాటు ఇంగ్లిషు మీడియంతో కొత్త దనం చోటు చేసుకోనుంది.
11 పాఠశాలలకు మంజూరైన నిధులివే..
మండలంలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. ఏటూరునాగారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.1.07 కోట్లు, రామన్నగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 58. 71లక్షలు, రొయ్యూరులోని ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 44.22 లక్షలు, శంకరాజుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 41.43లక్షలు, గోగుపల్లిలోని ప్రాథమిక పా ఠశాలకు రూ.29.98లక్షలు, చెల్పాకలోని మండ ల పరిషత్ పాఠశాలకు రూ. 21లక్షలు, మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలకు రూ. 15లక్షలు, నార్త్ ప్రాథమిక పాఠశాలకు రూ.6.35లక్షలు, మండల పరిషత్ పాఠశాలకు రూ.10.98లక్షలు,ఆకులవారి ఘనపూర్ పాఠశాలకు రూ.17.41లక్షలు మంజూరయ్యాయి.
వసతులు పెరగనున్నాయి
‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల్లో మౌలిక వసతులు పెరగనున్నాయి. అన్ని రకాల వసతులు ఒకే సారి పెరగడం వల్ల పాఠశాలల రూపు రేఖలు మారనున్నా యి. దీంతో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం ఉండడంతో పా టు చదువుపై ఆసక్తి పెరగనుంది. పెయింటింగ్ కూడా చేసే అవకాశాలు ఉండడంతో నూతన ఒరవడి కన్పిస్తుంది. తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుతో విద్యార్థులకు ఈ సమస్య తీరనుంది. చెట్లల్లోకి, ఆరు బయట మల, మూ త్ర విసర్జన చేయడం పూర్తిగా తగ్గనుంది.
-చెరుకుల ధర్మయ్య, ప్రధానోపాధ్యాయుడు