హైదరాబాద్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏండ్లు అవుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ మేరకు 2014, ఫిబ్రవరి 20వ తేదీన కేసీఆర్‌తో కలిసి విజయసంకేతం చూపుతున్న ఫొటోతో పాటు ‘బిల్ ఈజ్ పాస్డ్’ అనే టైటిల్‌ను గురువారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ రోజును తెలంగాణ ఉద్యమచరిత్రలో సువర్ణ అధ్యాయంగా ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా సాగిన స్వరాష్ట్ర ఉద్యమం ఫలించిన రోజు అని పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో సాగిన పోరాటంతో కొన్ని దశాబ్దాల కల సాకారమైందని తెలిపారు.