నల్లగొండ, ఆగస్టు 05 : బీసీల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని బీసీ ఉద్యోగుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్, గుడిపాటి కోటయ్య, బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు అన్నారు. ఈ నెల 9న నల్లగొండలో జరుగనున్న బీసీల న్యాయ పోరాట సభ పోస్టర్, కరపత్రంను బుధవారం మిర్యాలగూడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, జాతీయ కుల గణనలో ప్రతి కులానికి ఒక యూనిక్ నంబర్ కేటాయించాలనే తదితర డిమాండ్లతో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడిపాటి కోటయ్య, మెండె వెంకట్, మాలి సైదులు, అంబటి శ్రీను, గోశిక దయాకర్, బంటు నాగేందర్, పసుల కాశి యాదవ్, అనంతుల అంజయ్య, జెల్లా సత్యనారాయణ, రాములు గౌడ్, పున్న రాములు, తోట వెంకటేశ్వర్లు, సైదులు పాల్గొన్నారు.