స్టేషన్‌ఘన్‌పూర్/వేలేరు, జనవరి 12 : అధికారమే లక్ష్యంగా ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోటు 420 హామీలు ఇచ్చి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా వేలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీ-పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గత డిసెంబర్ 9న రూ.2 లక్షల వరకున్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తానని తెలిపి నెల రోజులు గడిచినా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున రైతులందరికీ రైతుబంధు, రుణమాఫీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయంలో లంకె బిందెలున్నాయని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. సెక్రటేరియట్లో లంకెబిందెలు ఉండవని పేపర్లు, కంప్యూటర్లు ఉంటాయనే విషయం గమనించాలని హితవు పలికారు. రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రాలు, అభివృద్ధి పనులపై జ్యుడీషియల్ విచారణ, ‘ప్రజాపాలన’లో దరఖాస్తుల స్వీకరణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నదని కడియం ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయ పనులు మొదలుకాకముందే రైతుబంధు డబ్బులు వారి అకౌంట్లలో జమయ్యేవని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి, నాయకులు బిల్లా యాదగిరి, మల్లికార్జున్, భూపతిరాజు పాల్గొన్నారు.
క్రీడలకు కడియం ఫౌండేషన్ తనవంతు సహకారం అందిస్తున్నదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్వాగత్ యూత్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండ లం చాగల్లులో శుక్రవారం రాష్ట్ర స్థా యి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యా యి. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ పోగుల సారంగపాణి అధ్యక్షతన నిర్వహించిన సభలో కడియం మాట్లాడుతూ ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు కడియం ఫౌండేషన్ సహకారం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు బెలిదె వెంకన్న, రాపోలు మధుసూదన్‌రెడ్డి, బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, జఫర్‌గఢ్ పీఏసీఎస్ చైర్మన్ తీగల కరుణాకర్‌రావు, స్వాగత్ యూత్ అధ్యక్షుడు కూన రాజు, యూత్ సభ్యులు అన్నెపు కుమార్, సర్పంచ్‌లు కోతి రా ములు, ఆనంధం, చాగల్లు ఉపసర్పంచ్ రజితా రాజేశ్, కనకం రమేశ్, సత్యనారాయణ, మాజీ సర్పంచ్ హిమబిందు, ఎంపీటీసీ వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ ఫాతికుమార్, జీడి రమేశ్, అంబటి కిషన్ రాజు, పొన్న రాజేశ్, సంపత్ రాజు పాల్గొన్నారు.