ఖిలావరంగల్: వినాయక చవితి పండుగ నేపథ్యంలో వరంగల్ కూరగాయల మార్కెట్లో అక్రమంగా నిర్వహిస్తున్న టెండర్‌ను నిలిపివేయాలని కోరుతూ వరంగల్ కూరగాయల మార్కెట్ హోల్‌సేల్స్, రిటైల్ వ్యాపారుల సంఘం సభ్యులు సోమవారం వరంగల్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వినాయక చవితి రోజు ఒకే వ్యక్తి మార్కెట్ లోని అన్ని కేంద్రాల ద్వారా విక్రయాలు కొనసాగించేందుకు టెండర్ ప్రక్రియ కొనసాగించడం అన్యాయమన్నారు.
లక్షల్లో టెండర్ సొంతం చేసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బును సంపాదించేందుకు వినియోగదారులపై అధిక భారం వేస్తారని తెలిపారు. ఇలాంటి టెండర్లకు చట్టబద్ధత లేదని, నాటి కలెక్టర్ టెండర్ నిర్వహించద్దని ఆదేశాలు జారీ చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అధికారులు స్పందించి టెండర్ ప్రక్రియను నిలిపివేసి వినియోగదారులపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. వినత్ పత్రం ఇచ్చిన వారిలో కమిటీ అధ్యక్షుడు బిట్ల కృష్ణ తదితరులు ఉన్నారు.