దుగ్గొండి మార్చి 24: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బొంతల సాయికుమార్ కుటుంబ సభ్యులను కేశవపురం గ్రామ పార్టీ అధ్యక్షుడుతో కలిసి బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దిగులు పడొద్దని వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట యువజన విభాగం అధ్యక్షులు శానబోయిన రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ మోడం విద్యాసాగర్, నాయకులు పొగాకు బాలకృష్ణ, మాలగాని రమేష్, మోహన్ రావు, ప్రమోద్, తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.