పంట పెట్టుబడి కోసం కేసీఆర్ సర్కారు ఇస్తున్న ‘రైతుబంధు’ సాయం అందుకొని కర్షకలోకం సంబురపడుతున్నది. యాసంగి సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తుండగా తమ మొబైల్ ఫోన్లకి వస్తున్న మెసేజ్లను చూసి మురిసిపోతున్నది. వెంటనే బ్యాంకులు, మినీ ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అదునుకు ఆదుకుంటున్నాడంటూ హర్షంవ్యక్తంచేస్తున్నారు. ఇదివరకు వ్యవసాయం చేసేందుకు అప్పు తేవడం, వాటిని కట్టలేక చాలా ఇబ్బంది పడేవాళ్లమని.. ఇప్పుడు ఆ అవసరం లేకుంటా చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇలా మూడో రోజైన శుక్రవారం పలువురు రైతులు ‘రైతుబంధు’ సాయం అందుకోగా, కేసీఆర్ ఇచ్చిన భరోసా, ఉత్సాహంతో బంగారు పంటలు పండిస్తామంటున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 30
సర్కారు సాయం మరువం
నర్సింహులపేట : కేసీఆర్ సర్కారు పెట్టుబడి సాయం అందించడం ఎంతో అనందంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చినప్పటి నుంచే మళ్లీ ఎవుసం చేసుడు మొదలుపెట్టిన. అంతకుముందు వ్యవసాయం చేసినా అప్పులపాలయ్యేది. ఇప్పుడా బాధలేకుంట జేసిండు కేసీఆర్ సారు. నాకు ఉన్న భూ మికి పెట్టుబడి సాయం అందుతాంది. బయట వ్యాపారుల దగ్గరికి పోకుంట రైతుబంధు డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. పెట్టుబడి సాయం ఇస్తున్న సర్కారును ఎప్పుడూ మరువం.
– లావుడ్యా సామ్య, గోపతండా
అదునుకు ఆదుకుంటున్నడు
నర్సింహులపేట : నాకు రెండెకరాల భూమి ఉంది. రైతుబంధు పథకం పెట్టినకాన్నుంచి బ్యాంకుల పడుతున్నయ్. గత ప్రభుత్యాలు రైతులను పట్టించుకున్న పాపానపోలే. కరెంట్ ఉంటే నీళ్లు ఉండకపోయేది. ఎరువులు, ఇత్తనాల కోసం మస్తు తిప్పలయ్యేది. తెలంగాణ అచ్చినంక మా బాధలన్నీ పోయినయ్. కేసీఆర్ మా రైతులను దేవునోలె ఆదుకుంటున్నడు. జీవితాంతం బీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటం. ఎవుసం కోసం ఇప్పటిదాంక ఎవలు సుత ఒక్క రూపాయి ఇయ్యలే. కేసీఆర్ సార్ పుణ్యమా అని ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నరు. కరెంటు ఉండేది కాదు. నీళ్లు లేవు, మందు బస్తాలు దొర్కకపోయేది. ఇప్పుడా తిప్పలు లేకుంట జేశిండు కేసీఆర్ సారు.
– బానోత్ రాము, కౌసల్యదేవిపల్లి
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
కమలాపూర్ : నాకు 20 గుంటల పొలం ఉంది. ప్రతి యేడు పొలం దున్నే సీజన్ రాంగనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రైతుబంధు ఇస్తుండు. వచ్చిన డబ్బులతో ఎరువుల బస్తాలు, నాట్ల కూళ్ల పెట్టుబడులు ఎల్లుతున్నయ్. తెలంగాణ రాకముందు చిన్న, సన్నకారు రైతులను ఎవరూ పట్టించుకోలే. కేసీఆర్ సారు వచ్చినంక రైతులకు ఇబ్బంది లేకుండా వానకాలం, యాసంగి సీజన్లకు డబ్బులు ఇస్తూ ఆదుకుంటున్నడు. ఆరుగాలం కష్టపడి పండించే రైతులకు పంట పెట్టుబడికి రైతుబంధు సాయం అందజేస్తున్న కేసీఆర్కు రుణపడి ఉంటం.
– పసునూటి కుమార్, ఉప్పల్
అప్పు తెచ్చే అవసరం లేదు..
నల్లబెల్లి : రైతుబంధు పథకం అమలుతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు కుటుంబాలకు ఆత్మబంధువు అయిండు. ఇదివరకు పెట్టుబడి కోసం షావుకారి దగ్గర అప్పులు తెచ్చేది. పంట అమ్మిన పైసలే అటు కట్టేది. వచ్చిన లాభమంతా అప్పు తీర్చడానికి సరిపోయేది. మిగిలిన వాటితోనే సర్దుకుపోయేది. కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టినంక మాకు ధైర్యం వచ్చింది. అప్పు చేసే అవసరం లేకుంటైంది. అదునుకు పెట్టుబడి సాయం అందిస్తూ భరోసా ఇస్తున్నడు. పంటలు కూడా మంచిగ పండిస్తున్నం. ఇగ మాకు రంది లేదు.
– తెలంగాణ విజయ్, కొండైల్పల్లె
రైతులు బాగుపడుతున్నరు..
వేలేరు : తెలంగాణ అచ్చినంకనే రైతులు బాగుపడుతున్నరు. నాకు 2.10 ఎకరాల భూమికి రైతుబంధు డబ్బులు వచ్చినయ్. రూ.12వేల దాక అకౌంట్ల పడ్డయ్. వాటిని పెట్టుబడి ఖర్చులకు ఉపయోగించుకున్నా. యెనుకట రైతుల నుంచే భూమి శిస్తు వసూలు చేసి పీడించేటోళ్లు. పంటలు పండిన, పండకపోయినా కట్టుమనేటోళ్లు. అప్పట్లో పైసలు కట్టడానికి చాలా ఇబ్బంది పడేది. కానీ కేసీఆర్ అచ్చినంక రైతులకే డబ్బులిచ్చి సాయం జేత్తాండు. పంటలు మంచిగ పండుతానయ్. కాలం కూడా మంచిగైతాంది. ఇప్పుడే రైతులకు మంచి జరుగుతాంది. కేసీఆర్ సార్ కంటే మంచి చేసినోళ్లు ఎవరూ లేరు. అన్నీ ఎక్కువగానే చేత్తాండు. మళ్లీ కేసీఆర్ సార్కే ఓటు వేస్తా.
– బర్మావత్ సర్వనాయక్, కమ్మరిపేటతండా, వేలేరు మండలం
రైతుబంధు వల్లే సకాలంలో సాగు
పరకాల : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో సకాలంలో పంట సాగవుతున్నాం. ఇదివరకు పెట్టబడులు లేక సాగు మొదలు పెట్టేందుకు ఇబ్బందులు పడేవాళ్లం. కానీ సీఎం కేసీఆర్ రైతుబంధుతో ప్రతి ఎకరాకు 5వేల రూపాయల చొప్పున రెండు విడుతలుగా సీజన్ ప్రారంభంలోనే అందిస్తుండడంతో ఇబ్బందులు తప్పినయ్. దీంతో రైతులు సకాలంలో పంటల సాగును ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయానికి 24గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడంతో సాగు పెరిగింది. రైతును ఆదుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆరే. ప్రతి రైతు గుండెల్లో ఎప్పటికీ ఉంటడు. రైతులందరం ఆయన వెంటే ఉన్నాం.
– పిడుగు కొమురయ్య, గొల్లపల్లి, నడికూడ మండలం