మహదేవపూర్(కాళేశ్వరం), ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతారా అని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల సబ్ జైల్లో కాళేశ్వరం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డిని ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. జైల్లో పెట్టినా వెనకడుగు వేసిది లేదని, హామీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఆయన వెంట మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, సీనియర్ నాయకులు అన్కారీ ప్రకాశ్, మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలీం ఖాన్, మేసినేని రవీందర్రావు, తడకల రమేశ్, రామ్, లక్ష్మణ్, సునీల్ ఉన్నారు.