నల్లబెల్లి, మార్చి 21 : మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. మండలంలోని నారక్కపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మాడుగుల అజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవ రెడ్డి సూచన మేరకు మృతుని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ. 6 వేలు ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి సుమన్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోడూరు రాయసాబ్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి వక్కల యోగేశ్వర్, నాయకులు చిందం కుమారస్వామి, ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు మామిడి కృష్ణ, బొడిగే సుమన్ గౌడ్, కావటి గణేష్, వడ్లూరి లక్ష్మణ చారి పాల్గొన్నారు.