డోర్నకల్, జూలై 31 : రేషన్ షాప్ డీలర్ల కమీషన్ వెంటనే ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల రేషన్ షాప్ డీలర్లు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ డీలర్ల మండల అధ్యక్షుడు తేజావత్ లక్ష్మా మాట్లాడుతూ..ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగష్టు నెలల రేషన్ షాప్ డీలర్ల కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కింటాకు 16 రూపాయలు హమాలీ ఖర్చు కూడా చెల్లించలేదని అన్నారు.
రేషన్ షాపులో ఉన్న దొడ్డు బియ్యం గోదాంకు వెంటనే తరలించాలని కోరారు. గత ప్రభుత్వంలో రేషన్ షాప్ డీలర్లకు నెల నెల కమీషన్ వచ్చేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కమీషన్ చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్లు రాజారామ్, వీరన్న, సెట్ రామ్, కృష్ణవేణి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.