అర్రాస్ పెట్టేది కాంగ్రెస్.. అభివృద్ధి చేసేది బీఆర్ఎస్
‘దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ఫార్టీ.. కానీ ప్రజా సంక్షేమాన్ని అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ ..’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
- సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలో ప్రగతి వేగవంతం
- కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను ప్రజలు నమ్మొద్దు
- బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- నర్మెట మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
- ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, తండావాసులు
- ప్రచారంలో పాల్గొన్న ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
నర్మెట, అక్టోబర్ 30: ‘దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ఫార్టీ.. కానీ ప్రజా సంక్షేమాన్ని అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ ..’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గండిరామవరం, మాన్సింగ్తండా, దొంగచెలిమెతండా, ఆగపేట, ఇసుకబాయితండా, మచ్చుపహాడ్, సూర్యబండతండా, లోక్యతండాలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలు, తండాల్లో ప్రజలు డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మంగళహారతులతో స్వాగతం పలికారు. గండిరామవరం గ్రామంలో స్థానికులు పలు సమస్యలను పల్లా దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డీసీ తండా, దొంగచెలిమెతండా, ఇసుకబాయితండా ప్రచారంలో ఎంపీ మాలోత్ కవిత, రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విజన్‌తో పనిచేస్తున్నారని అన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ పథకాలను అర్రాస్ పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలయ్యే పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలే తప్ప అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తుంటే దీనిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నందున ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు.
అభివృద్ధి వైపు ప్రజలు నిలువాలి..
ఎన్నికలు సమీపించిన తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలను ఎవరూ నమ్మొద్దని, ప్రజలు ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ వెంట నిలువాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే జనగామను అభివృద్ధికి కంచుకోటగా మారుస్తానని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ లాంటి పథకాలు ప్రతి ఇంటికి అందాయని అన్నారు. కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదన్నారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లంబాడీలకు పెద్దపీట వేశారని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల చిరకాల కోరికను నేరవేర్చారని తెలిపారు. మన తండా మన రాజ్యం అనే నినాదాన్ని నిజం చేసిన నేత వెంటే మనమందరం ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గద్దల నర్సింగరావు, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రామిని శివరాజ్, సర్పంచ్‌లు జాల శ్వేత కిషన్, కున్సోత్ పావని జయరాంనాయక్, ముప్పిడి లక్ష్మీ ప్రతాప్, బానోత్ అనిత మంగనీయ, లకావత్ కిరణ్‌నాయక్, బానోత్ నీల లాలు, ఆమెడపు కమలాకర్‌రెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, ఎంపీటీసీలు ఎర్పుల చైతన్య హెబ్నేజర్, బానోత్ లలిత సోమ్లా, చేర్యాల మార్కెట్ డైరెక్టర్ బావండ్లపల్లి రాజు, గ్రామ అధ్యక్షుడు జినుక రవి, మేడబోయిన రాజు, వస్పరి రాజు, పండుగ మల్లేశం, నాయకులు నీరేటి సుధాకర్, జంగిటి అంజయ్య, కంతి రాజలింగం, బెడుదం సుధాకర్, వంగ ప్రణీత్‌రెడ్డి, ఇట్టబోయిన రమేశ్, గద్దల విజయ్‌కుమార్, చేర్యాల సత్యనారాయణ, తుప్పుడు భిక్షపతి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

