కాశీబుగ్గ, నవంబర్ 3: ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం వస్తున్న మోసగాళ్లను ప్రజలు నమ్మొద్దని, బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం నగరంలోని 3వ డివిజన్లోని కొత్తపేట, ఆరపల్లి, పైడిపల్లిలో అరూరి ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఊరూరా డప్పుచప్పుళ్లు, మంగళహారతులు, కోలాటాలు, బతుకమ్మలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, అభివృద్ధిని చూసి ప్రజలు మరోసారి తనను ఓటుతో దీవించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, వారి మాయమాటల్లో ప్రజలు పడొద్దన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. రాష్ట్ర రైతు విమోచన చైర్మన్ నాగుర్ల వెంకన్న, జిల్లా రైతుబంధు అధ్యక్షురాలు ఎల్లావుల లలితా కుమార్ యాదవ్, కార్పొరేటర్ జన్ను షిభారాణీ అనిల్, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, బొచ్చు రాజు, పండుగ రవీందర్‌రెడ్డి, జన్ను రాజయ్య, లింగం కోటి, జన్ను సారంగపాణి, చెక్కర స్వామి, ఇట్యాల సతీష్, కేతిరి రాజశేఖర్ పాల్గొన్నారు.
హసన్‌పర్తి: మండలంలోని వంగపహాడ్, బైరాన్‌పల్లి, సిద్దాపూర్, అర్వపల్లి, మల్లారెడ్డిపల్లి, హెచ్‌సీఎన్ తండా, కొత్తపల్లిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ శుక్రవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలు మంగళహారతులు, కోలాటాలు, బతుకమ్మలతో అరూరికి పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటువేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లును అభ్యర్థించారు. ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, జరుగబోయే అభివృద్ధిని వారికి వివరించారు. మూడోసారి కారుగుర్తకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. తాను నియోజకవర్గ ప్రజల కోసం పెద్ద జీతగాడిలా పనిచేస్తానని అన్నారు. మాయమాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ, నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత, ఒకటో డివిజన్ అధ్యక్షుడు జంగ కుమార్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు మెరుగు రాజేశ్‌గౌడ్, జక్కు రమేశ్ గౌడ్, సర్పంచ్‌లు కుందూరు సాంబారెడ్డి, జనగాం ధనలక్ష్మికిరణ్, తగరం జెన్నయ్య, కేతపాక శాంతి భగత్, సుమలత రామరాజు, నునావత్ ఐలమ్మా మొగిలి, మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, మాజీ జడ్పీటీసీ సుభాశ్‌గౌడ్, మాజీ గంథాలయ డైరెక్టర్ సముద్రాల మధు, గ్రామ అధ్యక్షుడు చింతం శ్రీనివాస్, బైరగోని పరమేశ్వర్, బైరి మధుకర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ జయశంకర్, ఎంపీటీసీ మంజులా కుమారస్వామి, ఉపసర్పంచ్ సురేందర్, వెంకటేశ్, ధనుంజయ, శ్యామ్, చిరంజీవి, శివకుమార్ పాల్గొన్నారు.