హనుమకొండ, అక్టోబర్ 9 : రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 2024 నుండి సెప్టెంబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ బకాయిలను 18 నెలలు గడిచినా చెల్లించకపోవడం దారుణమన్నారు. పెన్షనర్లను మానసికంగా వేధించడమేనని, తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పెండ్లి చేయలేక, ఇల్లు కట్టుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, బ్యాంకు ఈయంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, ఆరోగ్యాన్ని బాగు చేసుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నామన్నారు.
26 మంది రిటైర్డ్ అయిన పెన్షనర్లు చనిపోయారని, కొంతమంది పెన్షనర్లు కోర్టును ఆశ్రయించగా వారికి చెల్లించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 13000 మంది రిటైర్డ్ అయ్యారని, 18 నెలల నుంచి వారికి బకాయిలు చెల్లించడంలేదని మండిపడ్డారు. విసిగి, వేసారి చివరికి రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకువస్తామని వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు, ఎండీ మహబూబ్ అలీ, గౌరవాధ్యక్షుడు ఎం.చంద్రమౌళి, జాయింట్ సెక్రెటరీలు ఎండి.అబ్దుల్ గఫార్, ఎం.దామోదర్, ట్రెజరర్ సూర కుమారస్వామి, ఉపాధ్యకుడు సంకా బద్రి నారాయణ, ఎస్. గోవర్ధన్, పి.సంజీవరెడ్డి, లక్ష్మయ్య, కార్యదర్శులు ఎస్. విష్ణు వర్ధన్, పి.సోమయ్య, పి.రమణారెడ్డి, జి.కిషన్‌నాయక్, దుర్గం రవి, ఇంద్రసేనారెడ్డి, బి.అశోక్‌కుమార్, టి.రఘువీర్, ఆడిట్ కమిటీ సభ్యులు
కె.శ్రీనివాస్, జి.రమేష్, సభ్యులు పి.రాజీరెడ్డి, బి.చొక్కయ్య పాల్గొన్నారు.