హనుమకొండ, జూన్ 19 : ‘ప్రాజెక్టులపై అవగాహలేని అవివేకి సీఎం రేవంత్‌రెడ్డి.., గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుతో ఉమ్మడి వరంగల్ జి ల్లా ఎడారిగా మారనుంది.., దేవాదుల ప్రాజెక్టుపై సీఎం వెకిలి మాటలను ఖండిస్తున్నాం’ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాల గురించి తెలియని సీఎం తెలంగాణ నీటి వనరులను ఎలా కాపాడుతాడని ప్రశ్నించారు.
చిన్న పగుళ్లను సాకుగా చూపి కాళేశ్వరం కూలిపోయిందని విషప్రచారం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే కాళేశ్వరాన్ని పండబెట్టి రైతుల పొలాలను ఎండగొట్టిందన్నారు. నాట్లకు నాట్లకు మధ్య కేసీఆర్ రైతుబంధు ఇస్తే రేవంత్‌రెడ్డి మాత్రం ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి వేసే డబ్బులు రైతు భరోసా కాదు.. ఎన్నికల భరోసా అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముం దు ఇచ్చి హామీ ప్రకారం ఇప్పటివరకు రైతులకు ఎకరాకు రూ. 25వేల చొప్పున బకాయిపడ్డారని, ఆ నగదు రైతుల ఖాతాలో వేస్తేనే కాంగ్రెస్ పార్టీకి రైతులపై చిత్తశుద్ధితో ఉన్నట్లని పెద్ది అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణకు హకుగా రావాల్సిన నీటి వనరులపై కనీస అవగాహన లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీరందించే దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో కూడా రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని, వీరు తెలంగాణ హకులను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను ఎడారిగా మార్చే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా ని ర్మించి, అభివృద్ధి చేసిన పాకాల, గణపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని పెద్ది తప్పుబట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా స్థానిక మంత్రులు సీతక, సురేఖ, ఎమ్మెల్యే లు, కనీసం నోరు మెదపడం లేదన్నారు. కుట్రపూరితంగా కాళేశ్వరంలో నీటిని నిల్వ చేయకపోవడంతో ఎస్సారెస్పీలోని డీబీఎం-38 కాల్వ పూర్తి గా వట్టిపోయి రైతుల పొలాలు ఎండిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నాటికే నీళ్లు ఇవ్వలేమని చేతులెత్తేసిందని, ఎర్రటి ఎండ లు మే నెలలో సైతం నీటిని విడుదల చేసిన ఘనత కేసీఆర్ పాలనకు దకుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల అవసరాలు తెలియని రేవంత్‌రెడ్డి వారి ప్రయోజనాలను ఎలా కాపాడుతాడని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి గురువైన చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడని ఆరోపించారు. బనకచర్ల విషయంలో బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గోదావరి, కృష్ణా జలాలపై కనీస అవగాహన లేకుండా పరిపాలన సాగిస్తున్నందుకు, తెలంగాణ ప్రజల హకులను కోల్పోయేలా చేస్తున్న వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ తదితరులు పాల్గొన్నారు.