హనుమకొండ, మార్చి 19 : దేవాదుల ప్రాజెక్టు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంతోనే జిల్లాలో పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పర్సంటేజీల కోసం కకుర్తి, మెయింటనెన్స్ లేకనే దేవాదుల నీరందడం లేదని, తద్వారా జిల్లాకు కరువొచ్చిందని పేర్కొన్నా రు. దేవాదుల ప్రాజెక్టు ఫేస్ -3 పంప్‌హౌస్ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మోటర్లు ప్రారంభించాకే ఇక్కడి నుంచి వెళ్తామని ప్రగల్భాలు పలికి దొంగల్లా పారిపోయారన్నారు. ఏ మొహం పెట్టుకొని వరంగ ల్కు వస్తారని, ఇక్కడి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హెలిక్యాప్టర్‌లో విహార యాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్లారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ హ యాంలోనే 95 శాతం దేవాదుల మూడో దశ పనులు పూర్తయ్యాయన్నారు.
నీటి నిల్వలు ఉన్నప్పటికి పంటలు ఎందుకు ఎండుతున్నాయో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు మెయింటనెన్స్‌కు ఏటా రూ. 7 కోట్లు ఖర్చవుతుందని, కాంట్రాక్టర్ 20 శాతం కమీషన్ ఇవ్వనందున బిల్లులు విడుదల చేయకపోవడంతో అతడి వద్ద పనిచేసే సిబ్బంది సమ్మెతో నేడు ఈ దుస్థితి వచ్చిందని, ఈ పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. వాళ్లకు పర్సంటేజీలపై ఉన్న శ్రద్ధ రైతాంగానికి నీళ్లివ్వడంలో లేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏప్రిల్, మే చివరి వరకు పంటలు పండుతాయని, అప్పటి వరకు నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏడాది క్రితం ప్రారంభించాల్సిన దేవాదులను ఇప్పటి వరకు ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఎండిన పంటలకు పంట నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి త్వరలో దేవాదుల పంప్‌హౌస్ పర్యటనను చేపట్టనున్నట్లు తెలిపారు. కడియం పార్టీలు మారడంపై, బిడ్డ ఎంపీ సీటు మీద దృష్టి పెట్టిండు తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని అన్నారు. నీళ్ల గురించి కొట్లాడింది కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినికాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, సీనియర్ నాయకులు సల్వాజీ రవీందర్రావు, నయీముద్దీన్, బండి రజినీకుమార్, నాయకులు చాగంటి రమేశ్, పోలపెల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.