వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను(Congress leaders) నిలదీయాలని నర్సంపేట మాజీ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy )పిలుపునిచ్చారు. సోమవారం పెద్ది ఆదేశాల మేరకు నర్సంపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తిమ్మంపేట బీఆర్ఎస్ గ్రామ ఇన్చార్జి శానబోయిన రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. బోనస్ హామీ బోగస్ అని తేలిపోయిందన్నారు. రుణమాఫీ కాక రైతు బతుకు రణంగా మారింది. కాంగ్రెస్ పాలనలో రైతన్నది భరోసా లేని బతుకైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, గ్రామ పార్టీ అధ్యక్షులు ధోనపాటి జనార్దన్ రెడ్డి, మండల నాయకులు తోటకూరి రాజు, కొల్లూరి మోహన్ రావు PACS డైరెక్టర్ నరహరి భాస్కర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అనుమాండ్ల సమ్మిరెడ్డి, తోటకూరి రమేష్, బీరం ప్రభాకర్ రెడ్డి, తోటకూరి శ్రీనివాస్, జన్నపురెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కత్తి యాకంబ్రం, మాజీ ఉప సర్పంచ్ గిన్నె భాస్కర్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు దండు రాజు, కోమాండ్ల రమణారెడ్డి, గోళ్లేనా రాజయ్య, ఐలయ్య, కత్తి రమేష్, ఈదుల అశోక్, కత్తి మొగిలి, మ్యాక రాజు, మోడెం ప్రశాంతి, ఎలకంటి విజయ, మ్యాక సూరమ్మ, బండి సంధ్య, మ్యాక కుమార్ తదితరులు పాల్గొన్నారు.