కోదాడ, ఫిబ్రవరి 06 : కోదాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు వార్డుల్లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ హాయాంలోనే కోదాడ పట్టణం అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తూ తమను గెలిపిస్తే వార్డు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 26వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిని సువర్ణాదేవి, 12వ వార్డులో గొర్రె శైలజ రాజేష్, 16వ వార్డులో కరీముల్లా బాబా, 8వ వార్డులో శాఖమూరి లక్ష్మీరాజ్యం కేశవులు పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.

కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం