Ajit Agarkar: అజిత్ అగార్కర్ ఔట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఇద్దరు సీనియర్లు !
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనున్నది. అయితే ఈసారి ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం లేదని బీసీసీఐలోని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. మాజీ క్రికెటర్లు పార్దీవ్ పటేల్, ప్రజ్ఞా ఓజాలు .. చీఫ్ సెలెక్టర్ రేసులో ఉన్నట్లు తెలిసింది.
ముంబై: సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనున్నది. కాంట్రాక్టు సమయం దగ్గరపడిన నేపథ్యంలో మళ్లీ అజిత్ అగార్కర్‌కు పొడిగింపు వస్తుందో లేదో తెలియడం లేదు. కానీ కొన్ని మీడియా సంస్థల ప్రకారం అగార్కర్‌ను ఆ పోస్టు నుంచి తప్పించనున్నట్లు తెలిసింది. భారత మాజీ సీనియర్ క్రికెటర్లు పార్ధీవ్ పటేల్, ప్రజ్ఞా ఓజా.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఉన్నట్లు ఓ ఆంగ్ల మీడియా కథనాన్ని రాసింది. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఇటీవల ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది వరల్డ్‌కప్ వరకు అగార్కర్ కాంట్రాక్టు పొడిగిస్తారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ బీసీసీఐలోని కొన్ని వర్గాలు.. అగార్కర్ పదవీకాలం ముగిసినట్లు చెబుతున్నారు. శుక్రవారం జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అగార్కర్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అగార్కర్ తన చివరి సెలెక్షన్ మీటింగ్‌ను బుధవారమే నిర్వహించినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మెన్ రేసులో మాజీ వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్, స్పిన్నర్ ప్రజ్ఞా ఓజా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ మూడుసార్లు ఐపీఎల్ విజేతలుగా నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

