Manoj Jarange | నిరాహార దీక్ష విరమించిన మనోజ్ జరాంగే.. ప్రభుత్వానికి మూడు నెలల గడువు
Manoj Jarange : మరాఠా రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన ఉద్యమకారుడు మనోజ్ జరాంగే తన దీక్ష విరమించాడు. 20 రోజులుగా సాగించిన దీక్షను సెప్టెంబర్ 17, గురువారం విరమించాడు.
Manoj Jarange : మరాఠా రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన ఉద్యమకారుడు మనోజ్ జరాంగే తన దీక్ష విరమించాడు. 20 రోజులుగా సాగించిన దీక్షను సెప్టెంబర్ 17, గురువారం విరమించాడు. మరాఠా రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వానికి మూడు నెలల గడువు విధించాడు. ఆలోపు ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే ఉద్యమాన్ని ముంబై నగరానికి తీసుకొస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మహారాష్ట్రలో మరాఠీలకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌తో మనోజ్ జరాంగే కొంతకాలంగా ఉద్యమం చేస్తున్నాడు.
ఇటీవల తన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగాడు. అలాగే, హైదరాబాద్ గెజిట్, సతారా గెజిట్, ఔంద్ గెజిట్ సహా పలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం కున్బి వంశస్థులను ఓబీసీలుగా గుర్తించాలని, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని ఆయన కోరుతున్నారు. అయితే, తన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఆయన నిరాహార దీక్ష విరమించారని ఆయన సన్నిహితులు తెలిపారు. రాష్ట్ర మంత్రులు రాధాకృకృష్ణ విక్కే పాటిల్, దాదా భూసె, ఎమ్మెల్సీ ప్రసాద్ లాద్, ఎమ్మెల్యే సురేష్ దాస్, ఇతర సీనియర్ అధికారులతో తాను చర్చలు జరిపినట్లు, అనంతరమే దీక్ష విరమించినట్లు స్వయంగా మనోజ్ ప్రకటించారు.
బీడ్ జిల్లాలోని పటోడాలో వారితో ఆయన చర్చలు జరిపారు. జల్నా జిల్లాలోని తన స్వగ్రామమైన అంతర్వాలి సరాటి గ్రామంలోనే మనోజ్ దీక్ష కొనసాగించారు. ఇంతకుముందు ఆయన సెప్టెంబర్ 19 నుంచి ముంబైలో దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే, దీక్ష చేసే సమయంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తుంటే.. ఈ సమయంలో మనోజ్ ముంబైలో దీక్ష చేయాలనుకోవడం సరైంది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో మనోజ్ దీక్ష విరమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి మూడు నెలల గడువు విధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

