Sridhar Vembu : ప్రస్తుతం ఐటీ నిపుణుల్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఏఐ. వేగంగా విస్తరిస్తున్న ఏఐ కారణంగా అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కోడింగ్ చేసే వారికి ఉపాధి అవకాశాలు తగ్గుతాయని నిపుణుల అంచనా. ఇప్పుడు ఇదే అంశంపై ప్రముఖ ఐటీ నిపుణుడు, టెక్ కంపెనీ అయిన ‘జోహో’ కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు స్పందించారు.
కోడర్లకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని, అందువల్ల ఇప్పటినుంచే కోడర్లు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఎంచుకోవాలని ఆయన సూచించారు. తనతోపాటు మిగతా కోడర్లు కూడా అప్రమత్తం కావాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. తాను కోడింగ్‌తో పని లేకుండా ఏఐ టెక్నాలజీ ద్వారా భగవద్గీత యాప్ డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. ‘‘కోడింగ్‌పై ఆధారపడ్డ వాళ్లు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూసుకునేందుకు ఇదే మంచి సమయం. నాకు కూడా ఇది వర్తిస్తుంది. నేను భయాందోళనతో ఈ మాట చెప్పడం లేదు. ప్రశాంతంగా వాస్తవాన్ని అంగీకరిస్తూ చెబుతున్నా’’ అంటూ శ్రీధర్ ట్వీట్ చేశారు.
Examples are now pouring in about AI-assisted Code Engineering productivity.
The quoted post is a Bhagwad Gita app.
Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.
At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU
— Sridhar Vembu (@svembu) February 6, 2026
టెక్నాలజీ మనిషిని వెనక్కు నెడుతుందని, ఇదే సమయంలో మనిషి నేల, ప్రకృతి, కుటుంబం, సంగీతం వంటి అంశాలపై ఫోకస్ చేసేలా చేస్తుందన్నాడు. ఈ అంశంపై తాను గూగుల్ జెమినితో జరిపిన చాట్‌ను ఆయన పంచుకున్నారు. శ్రీధర్ వెంబు ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన సలహాను సమర్ధిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముందుగానే ఇతర కెరీర్లపై ఫోకస్ చేయడం మంచదని కొందరు అంటుంటు.. టెక్నాలజీ ఎంత పెరిగిన మనిషి చేసే పనికి సాటిరాదని ఇంకొందరు అంటున్నారు.