హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 8 : ప్రతిభకు అంగవైక్యలం అడ్డుకాదని, సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యానైనా చేధించవచ్చని ద్రోణాచార్య అవార్డుగ్రహీత నాగపూరి రమేశ్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మం ది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు.
100 మీటర్స్‌లో హనుమకొండకు చెందిన కైఫ్ గోల్డ్ మెడల్ సాధించాడు. రెండోరోజు జరిగిన పోటీల్లో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు గట్టు మహేశ్‌బాబు పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ద్రోణాచార్య అవార్డు గ్రహీత, భారత అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపూరి రమేశ్, పారాఒలింపిక్స్ కాం స్య పతకం విజేత దీప్తి జీవన్జీ పాల్గొని విజేతలకు మెడల్స్ అందించారు.
అనంతరం రమేశ్ మాట్లాడుతూ పారాఒలింపిక్స్‌లో దీప్తి కాంస్య పతకం సాధించి ప్రపంచంలోనే ఓరుగల్లు ఖ్యాతిని చాటి చెప్పిందని గుర్తుచేశారు. దీప్తికి పేదరికం అడ్డురాలేదని వైకల్యంతో కుంగిపోకుండా పతకం సాధించిందన్నారు. దీప్తి మా ట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉండి ప్రోత్సహించాలన్నారు. పారాఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్‌రావు, వరంగల్ అధ్యక్షుడు మూగల కుమార్‌యాదవ్, డాక్టర్ మురళీధర్, పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, వంశీరెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కోచ్‌లు పాల్గొన్నారు.
విజేతలు వీరే..