దేవరుప్పుల/పాలకుర్తి, జూన్ 14 : రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది..’ అని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోలుకొండలోని వినాయకా కన్వెన్షన్ హాల్లో ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై శిక్షణ, ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించా రు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెం దిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ ప థకాలు అమలు కావడంతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. మోసకారి హామీలతో ప్రజలను న మ్మించి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడని ఆయన వివరించారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ చెప్పినట్టే ప్రజలు మోసపోయిండ్రు.
ఇప్పుడు పశ్చాతాపడుతున్నరని ఎమ్మెల్యే పల్లా అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రచ్చబండపై చర్చ పెట్టాలన్నా రు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదును భారీగా చేయించాలన్నారు. అన్ని సర్వేలు చూస్తే మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెబుతున్నాయని, పాలకుర్తిలో మళ్లీ దయాకర్‌రావు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ పట్ల అ ప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ఒక్క ఓటు పోకుండా చూడాలని దిశానిర్ధేశం చేశారు. ‘పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝూన్సీరెడ్డి అమెరికా నుంచి నేరుగా వస్తుండ్రు.. డాలర్లు పంచుతరని నమ్మి జనం ఓట్లేసిండ్రు. అనేక హామీలిస్తే ప్రజలు నమ్మి గెలిపంచిండ్రు. తీరా అంతా ఉల్టాపల్టా అయింది..’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నా రు. పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్‌రావు చేసిన అభివృద్ధి తప్పితే జరిగింది సున్నా అన్నారు.
‘బీఆర్ఎస్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో గెలిచిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నడో చెప్పా లె.. దేవాదుల సృష్టికర్తను తానేనని చెబుతుండు.. దేవాదులకు ఎక్కడ ఎప్పుడు, ఏం చేసిండో చెప్పాలి..’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్లను దేవాదుల ప్రాజెక్ట్‌కు కేటాయించి 42 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసి 5.48 వేల ఎకరాలకు సాగునీరు అందించారని వివరించారు. మరో రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే రెండు లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తుందన్నారు. ఈ నిధులు కేటాయించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులు రావడంలేదని విమర్శించారు.
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నాజీల వారసుడు సీఎం రేవంత్‌రెడ్డి హిట్లర్ స్ఫూర్తితో సైకో పాలన కొనసాగిస్తున్నాడని ప్రముఖ కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు డిక్లరేషన్లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి కూల్చివేతలతో విధ్వంసం సృష్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో స్కాంలు తప్ప అభివృద్ధి లేదన్నారు. వనరులను దోపీడీ చేస్తూ పక్క రాష్ర్టానికి సద్దులు మోస్తున్నాడన్నారు. జై తెలంగాణ అనని ద్రోహి తెలంగాణను పాలించడం దుర్మార్గమన్నారు.
రాష్ట్రంలో పాపాత్ముడి పాలన నడుస్తున్నదని, రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తూ గల్లీ పేదల కడుపు కొడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమనాయకుడు కేసీఆర్‌ను తిట్టుడు, ఒర్రుడు తప్ప అభివృద్ధి లేదన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్న దుర్మార్గుడన్నారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను ఆంధ్రాకు తరలిస్తున్న దొంగ రేవంత్‌రెడ్డి అన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకంపై కేసులు వేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డిదేన్నారు. తమ్మిడిహట్టిపై తట్టెడు మట్టి తీయలేదన్నారు. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడానికి సీఎం రేవంత్‌రెడ్డికి అపాయింట్మెంట్ కూడా దొరకపోవడం సిగ్గు చేటన్నారు. రేవంత్ చేతగానీ తనాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై నెట్టడం సరికాదన్నారు.
ఎస్ల్బీసీ సొరంగం పనుల్లో కార్మికుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడని, నేటి వరకు వారి శవాలను కూడా తీయలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగింది, విధ్వంసం పెరిగిందన్నారు. ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్‌రెడ్డి అని, చంద్రబాబు నాయుడి ఏజెంటుగా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, పవన్‌కల్యాణ్ తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కుట్రలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మోదీ చేతిలో రేవంత్ కిలుబొమ్మగా మారడాన్నారు.
తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కల్యాణ్ అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. ముమ్మాటికీ తెలంగాణ మన అయ్య జాగీరే అన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని చెప్పారు, రాష్ట్రంలో బడేబాయ్, చోటా బాయ్ బంధం నడుస్తోందన్నారు. బండి సంజయ్ కొడుకును రేవంత్‌రెడ్డి కాపాడాలని చూశాడన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో దేవాదుల, ఎస్సారెస్పీ నీరు గలగల పారేదని, నేడు ఆ నీరెటుపోయిందని స్థానిక ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
– ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
తెలంగాణలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని, అన్ని వర్గాలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, కాంగ్రెస్, బీజేపీ ఏకమైనా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం, సీఎంగా కేసీఆర్ కావడం ఖాయమని స్పష్టం చేశారు. సభలో పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై దిశానిర్ధేశం చేశారు. ఇక పాలకుర్తిలో తన గెలుపు నల్లేరుపై నడకేనని, అనేక సర్వేలు బీఆర్ఎస్ పక్షాన భారీ మెజారిటీని చూపుతున్నాయన్నారు.

ఇక సభ్యత్వం నమోదు పకడ్బందీగా జరగాలని, ఆన్లైన్ సభ్యత్వ నమోదు కావడంతో ఎంపిక చేసిన బూత్ కన్వీనర్లు, ఎస్ఐఆర్ కన్వీనర్లు తమ విధిని సక్రమంగా నిర్వర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు చూపాలని, ఇందుకు ప్రతి కార్యకర్త కృషి అవసరమన్నారు. సోషల్ మీడియాను మరింత వినియోగించుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఎత్తి చేపాలని, మనం సాధించిన విజయాలను వివరించాలన్నారు.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అమలు కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చాడన్నారు. రేవంత్‌రెడ్డికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలను తరిమికొడుతారని చెప్పారు. హామీల అమలులో రేవంత్‌రెడ్డి విఫలమయ్యాడన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.

అభివృద్ధికి మారు పేరు ఎర్రబెల్లి దయాకర్‌రావు అని, ఎర్రబెల్లి హయాంలో పాలకుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అభివృద్ధిని విస్మరించిందని, రీల్స్ చేయడం తప్ప అభివృద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీష్‌రెడ్డి, హనుమకొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ మారెపెల్లి సుధీర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత బీఆర్ఎస్ జెండాను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆవిష్కరించగా, ఆనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ అమరవీరుల స్తూపానికి అతిథులు, నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
-మాజీ మంత్రి సత్యవతి