రఘునాథపల్లి/చిల్పూర్/స్టేషన్‌ఘన్‌పూర్/జఫర్‌గఢ్, డిసెంబర్ 8 : బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసి పల్లెలను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రఘునాథపల్లి మండలంలోని మల్లంపల్లి, శివాజీనగర్, గోవర్దనగిరి, గబ్బెట, పత్తేషాపురం, ఇబ్రహీంపూర్, కిలాషాపురం, రామరాయిని బంగ్లా, మేకలగట్టు, అశ్వరావుపల్లి, రఘునాథపల్లి, చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, కొండాపూర్, మలాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం, జఫర్‌గఢ్ మండలం సాగరం, కూనూరు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోరుతూ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి ప్రచారం చేశారు.
అనంతరం రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్లో గెలిచి తన బిడ్డను ఎంపీగా చేయడానికి కాంగ్రెస్‌లో చేరి తల్లి లాంటి పార్టీని మోసం చేశాడని అన్నారు. రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి మల్లన్నగండి నుంచి గండిరామారానికి సాగు నీళ్లు తెచ్చానని కడియం చెప్పడం అబద్ధమని, తన నియోజకవర్గంలో ఆయన ఎలా అభివృద్ధి చేస్తాడో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఆయన పదవి ఎప్పుడు ఊడుతుందో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. బీఆర్ఎస్ కార్యర్తలను బెదిరింపులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, నియోజకవర్గ కోఆర్డి నేటర్ కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, ఇన్చార్జి వై కుమార్‌గౌడ్, జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రా కేశ్‌రెడ్డి, మండల కన్వీనర్ ముపిపట్ల విజయ్, యూత్ అధ్యక్షులు దుబ్బాక హరీశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ లోడెం రజితారవీందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు వెన్నం మాధవరెడ్డి, నాయకులు అశోక్, కట్ల సదానందం, నాగేశ్వర్రావు, గూడ కిరణ్, గాలి ప్రవీణ్, మేడిపల్లి రమేశ్, మంతెన రాజు, రవియాదవ్, పోతన రాజబాబు తదితరులు పాల్గొన్నారు.