జనగామ, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల వెనుకబాటుకు గురైన మారుమూల ప్రాంత గిరిజనులను గుర్తించి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని కులాలు, మతాలను సమాన భావంతో చూసి రాజధాని నడిబొడ్డు న కుల సంఘాలకు స్థలాలు కేటాయించి భవనాలు నిర్మించామన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో డాక్ట ర్ లక్ష్మీనారాయణ నాయక్ అధ్యక్షతన జరిగిన శ్రీశ్రీశ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
జనగామలో బంజారా భవన్‌కు స్థలం కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. పట్టణంలో సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపనకు తాను దాతగా ఉంటానని ప్రకటించారు. ప్రతి గిరిజన తండాలో కనీస వసతులు, తాగునీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని, బంజారా బిడ్డలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
వేడుకల్లో బంజారా కళాకారుడు ఎస్పీ నాయక్, సోమల దాదా, రాష్ట్ర నాయకుడు అజ్మీరా స్వామి నాయక్, సేవాలాల్ జయంతి స్పెషల్ ఆఫీసర్ రూపారాణి, మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనితానాయక్, డాక్టర్ బాలాజీనాయక్, శంకర్‌నాయక్, బంజారా నాయకులు కొర్ర కాలురామ్నాయక్, ధర్మ బిక్షంనాయక్, బానోత్ రవినాయక్, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌నాయక్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌నాయక్, బిక్షపతినాయక్, వెంకటేశ్‌నాయక్, జైరామ్నాయక్, వినోద్‌నాయక్, రాజునాయక్, కోటినాయక్, రమేశ్‌నాయక్, ఠాకూర్‌నాయక్, ప్రదీప్‌నాయక్, మహేందర్‌నాయక్, జూమ్లాల్నాయక్, కొర్ర శంకర్‌నాయక్, కిషన్‌నాయక్, హాలియా, విజేందర్ పాల్గొన్నారు.