కమలాపూర్, అక్టోబర్ 6: స్థానిక సం స్థల ఎన్నికల్లో కమలాపూర్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వర ఫంక్షన్ హాల్లో సోమవారం ని ర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆ యన పాల్గొన్నారు. ఒక్క యూరియా బస్తా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే హ క్కులేదన్నారు.
నియోజకవర్గంలో అత్య ధిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకోసం పనిచేసిన బీఆర్ఎస్ శ్రేణులకు వెన్నంటి ఉండి గెలిపించుకుంటానని హామీ ఇచ్చా రు. నియోజకవర్గంలో కేసీఆర్ రూ. వంద ల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి పూ ర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేసి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉండేవారికే టికెట్లు కేటాయిస్తామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్దే గెలుపన్నారు. ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ట్రాక్‌పై మిగిలి ఉన్న పనులు పూర్తిచేసేందుకు ఏండ్లుగా నిర్లక్ష్యం వహిస్తున్నదని కౌశిక్‌రెడ్డి విమర్శించారు. సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ జడ్పీటీసీ నవీన్‌కుమార్, మాజీ ఎంపీపీ లక్ష్మణ్‌రావు, డైరెక్టర్ సత్యనారాయణరావు, కృష్ణప్రసాద్, నాయకులు నాయినేని తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.